Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
క్రీడలు మానవుని జీవితంలో ప్రధాన పాత్ర పోషిస్తాయని బీటీపీఎస్ సీఈ బిచ్చన్న అన్నారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అధికారులు క్రీడలతో పాటు ఉద్యోగ బాధ్యతలను కూడా క్రమశిక్షణతో నిర్వహించాలన్నారు. శ్రీశైలం ఎడమ గట్టు విద్యుత్ కేంద్రంలో నిర్వహించిన తెలంగాణ ఇంటర్ ప్రాజెక్టుల షటిల్ బ్యాట్మెంటన్ టోర్నమెంట్లో బిటిపిఎస్ మణుగూరు జట్టు పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరచారన్నారు. టేబుల్ టెన్నిస్లో ద్వితీయ బహుమతి కైవసం చేసుకున్నారన్నారు. టీమ్ ఈవెంట్ నందు తృతీయ బహుమతి లభించింది అన్నారు. క్రీడాకారులను టీఎస్ జెన్కో ఎల్లప్పుడూ ప్రోత్సహిస్తుందన్నారు. అన్ని క్రీడల్లో పాల్గొని బీటీపీఎస్కు పేరు తీసుకు రావాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పోర్ట్స్ సెక్రటరీ కే.నరసింహారావు, మేనేజర్ రాజబాబు, బి.సత్యనారాయణ, సభ్యులు సతీష్ రెడ్డి, డి.సురేష్, ఎస్కే గని, ఎస్కే రాయి సాహెబ్, నవీన్ రెడ్డి, డీఈ సేమియా, తదితరులు పాల్గొన్నారు.