Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-టేకులపల్లి
టేకులపల్లి మండలం మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన కుటుంబానికి చెందిన డాక్టర్ సంజీవ్ ప్రసాద్ నాయక్ ఐఐటీ ధన్బాద్ ఝార్కండ్ యూనివర్సిటీలో పిహెచ్డి చేయుట అభినందనీయమని ఇల్లందు మార్కెట్ కమిటీ చైర్మన్ భానోత్ హరి సింగ్ నాయక్ అన్నారు. సోమవారం మండల కేంద్ర మైన గ్రామపంచాయతీ కార్యాలయ ఆవరణంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ కామర్స్ సభ్యుల ఆధ్వర్యంలో సన్మాన సభ ఏర్పాటు చేసి ఘనంగా శాలువాలతో సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. గిరిజన కుటుంబంలో పుట్టి పీహెచ్డీ సాధించడం గిరిజన తెగకు వన్నెతెచ్చిన వ్యక్తి అని కొనియాడారు. గిరిజనులు పట్టుదలతో ఏదైనా సాధిస్తారు అనే విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ భూక్య రాధా సైదులు నాయక్, సర్పంచ్ బోడ సరిత, ఎంపీటీసీ బి.బాలకృష్ణ, భూక్య దళ్ సింగ్ నాయక్, గుండా నరసింహరావు, టీఆర్ఎస్ మండల అధ్యక్ష, కార్యదర్శులు వరప్రసాద్, బాలు నాయక్, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ సభ్యులు స్థానిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.