Authorization
Mon Jan 19, 2015 06:51 pm
-ఖమ్మంలో ఘనంగా వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ (డబ్ల్యూఏఫ్టియు) ఆవిర్భావ దినోత్సవం
- సీఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు సాయిబాబు
నవతెలంగాణ-ఖమ్మం
1945 అక్టోబరు 3న డబ్ల్యుఎఫ్టియు స్థాపించి 77 ఏళ్లు సందర్భంగా సీఐటియు, ఏఐటియుసి ఖమ్మం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మంలో ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వ విధానాలు కార్మికులపై ప్రభావం అంశంపై సదస్సు నిర్వహించారు. ఈ సదస్సులో సీఐటియు ఆల్ ఇండియా ఉపాధ్యక్షులు ఎం.సాయిబాబు, ఏఐటియుసి రాష్ట్ర కార్యదర్శి సింగం నరసింహారావు మాట్లాడుతూ ప్రపంచ వ్యాప్తంగా ఉన్న కార్మికుల డిమాండ్లను బలోపేతం చేయడం, ఉధృతం చేయడం యూనియన్లను బలోపేతం చేయడానికి అన్ని దేశాలలోని కార్మికులు, వారి యూనియన్లు కలిసి డబ్ల్యూఎఫ్టియు సంస్థలో సహకరిస్తున్నాయని వారు తెలిపారు. అనేక దేశాల్లో జరుగుతున్న పోరాటాలు మన దేశ కార్మిక వర్గానికి స్ఫూర్తిదాయకమని అన్నారు. శ్రామిక వర్గానికి రక్షణ గోడను నిర్మించి, దోపిడీ లేని సమాజాన్ని నిర్మించడం మన బాధ్యత అని వారు పేర్కొన్నారు. ధరల పెరుగుదల కారణంగా కార్మికుల జీవన ప్రమాణాలు నాటకీయంగా దిగజారడం ట్రేడ్ యూనియన్ల ఎజెండాలో నేటి ప్రధాన సమస్య, అన్ని ప్రాథమిక అవసరాల ధరలలో పెరుగుదల, తప్పనిసరిగా వేతనాల కొనుగోలు శక్తిని వెదజల్లుతుందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సీఐటియు జిల్లా అధ్యక్షులు తుమ్మ విష్ణువర్ధన్, ఏఐటియుసి జిల్లా అధ్యక్షులు గాదె లక్ష్మీనారాయణ, ఏఐటియుసి జిల్లా కార్యదర్శి రామాంజనేయులు, సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు యర్ర శ్రీకాంత్, ఎం.గోపాల్, భూక్య శ్రీను, వ్యకాస సంఘం జిల్లా నాయకులు ఎర్ర శ్రీనివాసరావు, ఏఐటీయూసీ జిల్లా నాయకులు సీతామహాలక్ష్మి, జిల్లా నాయకులు నాగ సులోచన తదితరులు పాల్గొన్నారు.