Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- బతుకమ్మ సాక్షిగా మహిళల భద్రతకు భరోసా కల్పించాలి
- ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ
నవతెలంగాణ-వైరా టౌన్
మహిళలను ప్రతి ఒక్కరూ గౌరవించాలని, పురుషులతో సమానంగా ఎదగనివ్వాలని, బతకనివ్వాలని ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మేరుగు రమణ అన్నారు. అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) వైరా పట్టణ కమిటీ ఆధ్వర్యంలో వైరా మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లి (ఎజి)లో బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఐద్వా జిల్లా ఉపాధ్యక్షురాలు మెరుగు రమణ మాట్లాడుతూ మహిళలకు భద్రత కల్పించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వైఫల్యం చెందాయని, నేటి సమాజంలో మహిళల పైన అత్యాచారాలు, శారీరక, మానసిక వేధింపులు రోజు రోజుకు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. బతుకమ్మ సాక్షిగా ప్రతి ఒక్కరూ మహిళలను గౌరవిస్తామని, మహిళల భద్రతకు భరోసా కల్పిస్తామని ప్రతిన పూనాలని కోరారు. బతుకు నిచ్చే అమ్మ బతుకమ్మ స్ఫూర్తితో ఆడపిల్లలను పుట్టనిదాం, ఎదగనిద్దాం, చదవనిద్దాం, బ్రతకనిద్దామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐద్వా వైరా పట్టణ అధ్యక్షురాలు మచ్చా మణి, కార్యదర్శి గుడిమెట్ల రజిత, చావా కళావతి, భుక్యా విజయ, కొంగర ఉషా, కొంగర లక్ష్మీకాంతమ్మ, తన్నీరు మంగమ్మ, చిరుమామిల శకుంతల, చిరుమామిల సునీత, గన్నంమనేని విజయ, పోటు నాగమణి, చెరుకూరి నాగులు, కొంగర విమల, దేవబత్తిని అపర్ణ, కొమ్మినేని లీలమ్మ, బుగ్గినేని నాగమణి, దేవబత్తిని సరస్వతి, కొంగర రమ, దేవబత్తిని పుల్లమ్మ, భుక్యా ఉషా, బండారు మేఘన, బండారు సింధు తదితరులు పాల్గొన్నారు.