Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కమిటీ సమావేశంలో వక్తలు
- పలువురు సీనియర్ జర్నలిస్టులకు సన్మానం
నవతెలంగాణ-ఖమ్మం
సీఎం కేసీఆర్ జర్నలిస్టులకు ఇచ్చిన ఇళ్లు, ఇళ్ల స్థలాల హామీని అమలు చేయా లని టియుడబ్ల్యూజే ఐజేయు రాష్ట్ర ఉపాధ్యక్షులు కె. రాంనారాయణ, జాతీయ కౌన్సిల్ సభ్యులు రవీంద్ర శేషు డిమాండ్ చేశారు. సోమవారం ఖమ్మం నగరంలోని ఎస్ఆర్ కన్వెన్షన్ హాల్ లో ఖమ్మం జిల్లా ఎలక్ట్రానిక్ మీడియా జిల్లా కార్యవర్గ సమావేశం ఆవుల శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశంలో రాంనారాయణ, రవీంద్ర శేషు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధనలో జర్నలిస్టులు ముఖ్యభూమిక పోషించారు. సుదీర్ఘకాలంగా కోర్టులో పెండింగ్ లో ఉన్న ఇళ్ల స్థలాల సమస్య కూడా పరిష్కారం అయ్యిందని, ప్రభుత్వం వెంటనే జీవో ఇచ్చి ఇళ్ల స్థలాలు కేటాయించాలన్నారు. టియూడబ్ల్యూజే ఆధ్వర్యంలో చేపట్టిన అనేక ఆందోళన, పోరాటాలకు ప్రజాప్రతినిధులు, అధికారులు హామీలు ఇచ్చి అమలు చేయలేదన్నారు. ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధులుగా ఉన్న జర్నలిస్టులకు అనేక సమస్యలున్నాయని, వాటి పరిష్కారానికి ప్రభుత్వాలు క్నషి చేయాలని కోరారు.