Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జిల్లాలో పోడు భూముల సర్వే
- దరఖాస్తులు ఆధారంగానే హక్కు పత్రాలు ఇవ్వాలి : జిల్లా కార్యదర్శి కనకయ్య
నవతెలంగాణ-కొత్తగూడెం
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో పోడు భూముల సర్వే ప్రారంభమైందని, దరఖాస్తుల ఆధారంగానే హక్కు పత్రాలు ఇవ్వాలనే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి అన్నవరపు కనకయ్య డిమాండ్ చేశారు. మంగళవారం నవతెలంగాణ తో మాట్లాడారు. అనేక ఏళ్లుగా సీపీఐ(ఎం) చేసిన పోరాట ఫలితంగా జిల్లాలో పోటు భూముల సర్వే మొదలైందన్నారు. పోడు సాగు దారుల దరఖాస్తు ఆధారంగా వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. పోడు సాగు దారులకు హక్కు పత్రాలు ఇవ్వడంపై జిల్లాలోని పలు గ్రామాల్లో అధికారులు గత రెండు మూడు రోజులుగా గ్రామసభలు నిర్వహిస్తున్నారన్నారు. అశ్వారావుపేట, అన్నపురెడ్డిపల్లి మండలంలోని పలు గ్రామాల్లో రెవెన్యూ, ఫారెస్ట్, పంచాయతీ సెక్రటరీలు, వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో దరఖాస్తుల సర్వేను పరిశీలిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా మూడు సాగుదారులు పోడు పట్టాల కోసం దరఖాస్తు చేసుకున్న వాటి ఆధారంగా అధికారులు సర్వేలు కొనసాగిస్తున్నారు. గ్రామ సభలకు ఏర్పాట్లు చేస్తున్నారని తెలిపారు. పోడు సాగు దారులకు పట్టాలు ఇవ్వడం లో రాష్ట్ర ప్రభుత్వం మోకాలడ్డే ప్రయత్నాలకు తెరలేపారు. శాటిలైట్ ప్రాతిపాదికగా సర్వే చేసి పట్టాలు ఇవ్వాలని చూస్తున్నారు. దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. అలా చేస్తే పోడు రైతులకు తీవ్రంగా అన్యాయం జరుగుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ఆవేదన వ్యక్తం చేశారు. దరఖాస్తుల ప్రాతిపాదికగా చేసుకొని గ్రామ సభలు నిర్వహించి ఎఫ్ఆర్సి కమిటీల ద్వారా సర్వే చేయాలని అధికారులను డిమాండ్ చేశారు. అర్హులైన పోడు సాగుదారులందరికీ పట్టాలు ఇచ్చే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా పోడు పట్టాల సర్వే ప్రక్రియలో మంజూరులో ప్రజా ప్రతినిధుల జోక్యం లేకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. లేని పక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని ఆయన హెచ్చరించారు.