Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
2017 సింగరేణి ఎన్నికల సమయంలో శ్రీరాంపూర్ బహిరంగ సభలో సింగరేణి కార్మికులను బార్డర్లో ఉన్న సైనికులతో పోలుస్తూ కార్మికులకు సొంత ఇంటి పథకాన్ని అమలు చేస్తానని హామీ ఇచ్చారని సిఐటియు ఆధ్వర్యంలో పివికే, జికేఓసి, జేవిఆర్ ఓసి, సత్తుపల్లి కిష్టారం ఓసిలో సంతకాల సేకరణ నిర్వహించారు. ముఖ్యమంత్రి ప్రకటనతో కార్మికుల్లో హర్షాతిరేకలు వ్యక్త మయ్యాయని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సిఐటియు) కొత్తగూడెం బ్రాంచి కార్యదర్శి విజయగిరి శ్రీనివాస్ పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. కార్మికులు ఉంటున్న నివాస గృహాలలో ఉన్న కార్మికులు తొమ్మిది శాతం ఇంటికి కిరాయి కోల్పోవడమే కాక క్వార్టర్లలో ఉంటున్నందుకు వారి జీతాన్ని బట్టి సంవత్సరానికి రూ.20వేలు నుండి రూ.60 వేల వరకు ఇన్కమ్ టాక్స్ కడుతున్నారని తెలిపారు. కార్మికుడి సర్వీస్ కాలంలో చెల్లించే లక్షలాది రూపాయల ఇన్కమ్ టాక్స్‌తో సొంత ఇంటి నిర్మాణం చేసుకోవచ్చు అన్నారు. కార్మికుడు ఉద్యోగ విరమణ నాటికి పిల్లలకు ఉద్యోగాలు లేక, పెళ్లిళ్లు కాక, రిటైర్డ్మెంట్ తరువాత వచ్చే డబ్బులతో కుటుంబ అవసరాలు తీర్చుకోలేక పోతున్నారని, అద్దె ఇంటిలో ఉండాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని కార్మికులకు వివరించారు. సింగరేణి సంస్థలో దాదాపు 50 వేల కార్మిక గృహాలున్నాయని కార్మికుల సంఖ్య 40 వేలు ఉండగా అందులో కార్మికులకు కేటాయించిన క్వార్టర్లు 32 వేలు మాత్రమేనని, మిగిలిన క్వార్టర్లన్నీ అన్యాక్రాంతం అవుతున్నాయని తెలిపారు. ఈ గృహాలన్నీ రిటైర్డ్ అయిన కార్మికులకు, కాంట్రాక్టు కార్మికులకు కేటాయించాలని కోరారు. సంతకాలు సేకరించి ముఖ్యమంత్రికి పంపిస్తామని వివరించారు. సింగరేణి ఖాళీ స్థలాలు ఒక్కొక్క కార్మికునికి 250 గజాల స్థలము కేటాయించి, రూ.10 లక్షల వడ్డీ లేని రుణం మంజూరు చేయాలని, క్వార్టర్లలో నివసిస్తున్న కార్మికులు ఇన్కమ్ టాక్స్ పేరుతో లక్షలాది రూపాయలు చెల్లిస్తున్నారు. అందువలన ఎవరు ఉంటున్న క్వార్టర్ వారికే సొంతం చేయాలని, శిధిలావస్థలో ఉన్న క్వార్టర్లను కూల్చివేసి డబుల్ బెడ్ రూమ్ ఇండ్లను నిర్మించి ఇవ్వాలని, కోల్ ఇండియాలో ఇచ్చినట్టు సింగరేణిలో అధికారులకు చెల్లిస్తున్నట్లు 2011 సంవత్సరం నుండి పెర్క్స్ మీద ఇన్‌కమ్‌టాక్స్‌ను రియంబర్స్మెంట్ చేయాలని, మారు పేర్లు ఉన్న కార్మికులు సర్వీసులో ఉండగానే కాకుండా రిటైర్ అయిన తర్వాత కూడా పెన్షన్‌లో చాలా ఇబ్బందులు పడుతున్నారని 2022 ఏప్రిల్ లో ఆర్ఎల్సి సమక్షంలో ఒప్పందం జరిగినా కూడా అమలు చేయడం లేదని, 2017లో మీరు సరిచేస్తామని వాగ్దానం చేశారని అది వెంటనే అమలు చేయించగలరని, డిపెండెంట్ వయోపరిమితి 40 సంవత్సరాలకు పొడిగించాలని ఈ డిమాండ్లను కార్మికులకు వివరించారు. ఈ కార్యక్రమంలో కర్ల వీరస్వామి, ఎలగొండ శ్రీరామ్మూర్తి, బి.ప్రకాష్, రమణ, పి.నాగేశ్వరరావు, బాల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.