Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- దసరా తర్వాత క్షేత్ర స్థాయి పరిశీలన...
- కార్యదర్శులకు సామగ్రిని అందజేసిన అధికారులు...
నవతెలంగాణ-అశ్వారావుపేట
రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఆదేశాలు మేరకు దసరా తర్వాత పోడు భూములు సర్వేని ప్రారంభించనుంది. గతంలో గిరిజన ప్రాంతంలో పోడు సాగు దారులు నుండి స్వీకరించిన దరఖాస్తులు ప్రకారం దరఖాస్తు దారు వ్యక్తిగత వివరాలతో కూడిన సర్వే పత్రం, దరఖాస్తుదారునికి ముందస్తు జారీ చేసే నోటీసు, క్షేత్రం స్థాయిలో పరిశీలించిన అంశాలను పొందుపరచడానికి గానూ నమూనా రిజిష్టర్ స్థానిక కార్యదర్శులకు అందజేయనున్నారు. ఈ మేరకు పైన తెలిపిన సామగ్రిని మంగళవారం స్థానిక మండల పరిషత్ కార్యాలయంలోని ఎం.డి.ఒ ఛాంబర్ లో తహశీల్దార్ చల్లా ప్రసాద్, ఎఫ్ఆర్ఒ అబ్దుల్ రహ్మాన్, ఎండిఒ విద్యాధర రావులు కార్యదర్శులకు అందజే సారు. ఈ సందర్భంగా కార్యదర్శులకు సర్వే చేసే విధింపుపై పలు సూచనలు చేసారు. అనంతరం తహశీల్దార్ చల్లా ప్రసాద్ మాట్లాడుతూ ముందుగా గ్రామ స్థాయి ఎఫ్ఆర్సి కమిటీ చైర్మన్ సంతకంతో కూడిన నోటీస్ను సంబంధిత లబ్ధిదారులకు అందజేసి ప్రణాళిక ప్రకారం దరఖాస్తు ఆధారంగా ఎఫ్ఆర్సి, అటవీ శాఖ సిబ్బంది సంయుక్తంగా వివరాలు సేకరించి రిజిస్టర్లో నమోదు చేస్తారని తెలిపారు. ఈ సర్వే దసరా సెలవులు అనంతరం ఏం గ్రామానికి ఆ గ్రామంలో ప్రారంభిస్తామని తెలిపారు. అశ్వారావుపేట మండలంలో 40 ఆవాసాలులో 5233 దరఖాస్తులు పరిశీలిస్తామని అన్నారు.ఈ కార్యక్రమంలో కార్యదర్శులు శ్యాం కుమార్, రాంబాబు, జగదీష్, రామక్రిష్ణ, నాగేశ్వరరావులు ఉన్నారు.