Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు గిరిజన కృతజ్ఞత ర్యాలీ
- సాంప్రదాయ నృత్యాలు :
- బయ్యారంలో ఉక్కు ఫ్యాక్టరీ నిర్వహించాలి
- రాష్ట్ర గిరిజన సేవాలాల్ సేన
- వ్యవస్థాపక అధ్యక్షులు సంజీవ్ నాయక్
నవతెలంగాణ-ఇల్లందు
గిరిజనులకు 10 శాతం రిజర్వేషన్ల పెంపు పోరాటాల ద్వారా దక్కిన గౌరవమని రాష్ట్ర గిరిజన సేవాలాల్ సేన వ్యవస్థాపక అధ్యక్షులు, గిరిజన రిజర్వేషన్ పోరాటసమితి కన్వీనర్ భూక్య సంజీవ్ నాయక్ అన్నారు. పట్టణంలో గురువారం నియోజకవర్గ స్థాయి కృతజ్ఞత ర్యాలీ నిర్వహించారు. గోవింద్ సెంటర్ ఫారెస్ట్ గ్రౌండ్ నుండి కరెంట్ ఆఫీస్ వరకు గిరిజన సాంప్రదాయ నృత్యాలు, బాజా భజంత్రీలతో గిరిజన వేషధారణతో భారీ ప్రదర్శన నిర్వహించారు. అనంతరం కొత్త బస్టాండ్ ఏరియాలో కొమరం భీమ్, అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కొత్త బస్టాండ్, కరెంట్ ఆఫీస్ ఏరియాలో జరిగిన సభలో ప్రసంగించారు. గిరిజన రిజర్వేషన్ పెంచిన కెసిఆర్‌కు కృతజ్ఞతలు తెలిపారు. సేవాలాల్ సేన దశాబ్దాల కాలంగా ఉద్యమం ద్వారా సాధించిన విజయానికి గుర్తుగా విజయోత్సవ ర్యాలీ నిర్వహిస్తున్నామని అన్నారు. సేవాలాల్ జయంతి అధికారికంగా నిర్వహించడం, తండా, గూడెంలను పంచాయతీగా ఏర్పాటు చేసుకోవటం, 10 శాతం గిరిజన రిజర్వేషన్ పెంచటం తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవిర్భావంతో కెసిఆర్ చొరవతో సాధ్యం అయినదని అన్నారు. పోడు సమస్య పరిష్కారం కోసం జీవో ఇవ్వటంతో గిరిజన సంఘాల ఐక్య వేదిక, సేవాలాల్ సేన ఆహ్వానం మేరకు పాల్గొనటం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. కేంద్రం బయ్యారంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయాలనీ విభజన హామీ నెరవేర్చలేదని వాటిని అమలు చేయాలనీ డిమాండ్ చేశారు. సేవాలాల్ సేన రైతు సంఘ అధ్యక్షుడు బానోత్ కిషన్ నాయక్ మాట్లాడుతూ 10 శాతం రిజర్వేషన్ పోరాటాల ద్వారా సంజీవ్ నాయక్ సాధించారని అన్నారు. ఇల్లందు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్న సంజీవ్ నాయక్ కు సన్మానం చేయటం అదృష్టం అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రేమ్ చంద్ నాయక్, ఇస్లావత్ సతీష్, ఇస్లావత్ రాందాస్, ఇల్లందు మండల ఇంచార్జి మాలోత్ శివ, మల్లికార్జున్ యాదవ్. యాకుబ్.గంగవత్ కిషన్, సపవత్ నందులాల్ అనిల్ రెడ్డి, భూక్య గోవింద్ నాయక్, బాలకృష్ణ, భాస్కర్, సురేష్, హత్కర్ వెంకటేష్, రాజేష్, రాంబాబు, అనిల్. రమేష్ మాలోత్, చందర్ గుగులోత్,అశోక్ మాలోత్ రమేష్ రాథోడ్ తదితరులు పాల్గొన్నారు.