Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎమ్మెల్యే బానోత్ హరిప్రియహరిసింగ్
- 42 మందికి రూ.21 లక్షల సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ
నవతెలంగాణ-ఇల్లందు
ప్రజాక్షేమమే లక్ష్యంగా పేదలకు ప్రభుత్వం అండగా ఉంటుంటోందని ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ హరిసింగ్ అన్నారు. క్యాంపు కార్యాలయంలో మంగళవారం నియోజక వర్గంలోని ఐదు మండలాల్లో మొత్తం 42 మంది లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు. ఇల్లందు మండలంలో 11, టౌన్లో 7 గురు లబ్ధిదారులకు, టేకులపల్లి మండలంలో 5 గురు కామేపల్లి 16, గార్ల మండలం 3 లబ్ధిదారులకు, బయ్యారం మండలం నందు 6 గురు లబ్ధిదారులకు రూ. 20,90,500 చెక్కులను లబ్ధిదారులకు అందజేశారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే హరిప్రియ హరి సింగ్ నాయక్ మాట్లాడుతూ ఆపదలో ఉన్న వారికి ఆపన్న హస్తంలా, అనారోగ్యంకు గురై ఆర్థిక స్థోమత లేక ఆసుపత్రిలో చికిత్స పొందిన నిరుపేదలకు అండగా సీఎం సహాయ నిధి ఆర్థిక భరోసా కల్గిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ దిండిగాల రాజేందర్, మున్సిపల్ చైర్మన్ దమ్మలపాటి వెంకటేశ్వరరావు, జిల్లా రైతు బంధు సభ్యులు పులిగండ్ల మాధవరావు, డిసిసిబి డైరెక్టర్ జనగం కోటేశ్వరరావు, ప్రజా ప్రతినిధులు, ఐదు మండలాల టిఆర్ఎస్ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.