Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్
నవతెలంగాణ - ఖమ్మం కార్పొరేషన్
రాజ్యాంగ పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు చేపట్టాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక ఖమ్మం త్రీ టౌన్ లోని శ్రీనివాసనగర్‌లో కెవిపిఎస్ 24వ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కెవిపిఎస్ 3వ నగర కమిటీ ఆధ్వర్యంలో మాగి భద్రయ్య అధ్యక్షతన జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పాల్గొని ఆత్మగౌరవం, సమానత్వం, కుల నిర్మూలన లక్ష్యాలతో కూడిన కెవిపిఎస్ సంఘం జెండాను ఆయన ఆవిష్కరించారు. అనంతరం భారత రాజ్యాంగ నిర్మాత డా.బి.ఆర్. అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ మాట్లాడుతూ కుల నిర్మూలన కోసం పోరాటాలను విస్తృతంగా చేపట్టాలని నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తరువాత దేశంలో దళితులపైన, మైనార్టీల పైన, మహిళలపైన దాడులు పెచ్చరిల్లాయని, రాజ్యాంగానికి, రిజర్వేషన్లకు పెద్ద ప్రమాదం పొంచి ఉందని నందిపాటి మనోహర్ విమర్శించారు. రాజ్యాంగ పరిరక్షణకు పెద్దయెత్తున ఉద్యమించాలని కెవిపిఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి నందిపాటి మనోహర్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గిరిజన సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుగ్గి కృష్ణ, దళిత నాయకులు గుంతేటి వీరభద్రయ్య, కెవిపిఎస్ జిల్లా నాయకులు ఎస్.కె. సైదులు, మాగి భద్రయ్య, నగర నాయకులు మండల వీరస్వామి, మండల జగదీశ్, బి. రామస్వామి, సత్యనారాయణ,పాల్గొన్నారు.