Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్ అప్జల్ హసన్
నవతెలంగాణ-ఖమ్మం
అన్నదానం మహాదానం అని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్ అప్జల్ హసన్ అన్నారు. మంగళవారం ఖమ్మం నగరంలోని సరిత క్లినిక్ సెంటర్లో శ్రీ బాల త్రిపురదేవి శరన్నవరాత్రి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కాళిక మాత విగ్రహం వద్ద మెడికల్ ఫోరమ్ అధ్యక్షులు పిరంగి శ్రీను దంపతుల ఆహ్వానం మేరకు అన్నదాన కార్యక్రమాన్ని టీఎన్జీవోస్ యూనియన్ జిల్లా అధ్యక్షులు షేక్.అప్జల్ హసన్ అమ్మవారి పూజలో నిర్వహించి, భక్తులకు అన్నదానం చేశారు. అనంతరం శరన్నవరాత్రి ఖమ్మం నగరంలోని లెనిన్ నగర్లో ఏర్పాటు చేసిన కాళికా మాత విగ్రహం వద్ద అంబ భవాని యూత్ ఆధ్వర్యంలో అన్నదానం ప్రారంభించారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజరు కుమార్ వ్యక్తిగత సహాయకులు చిరుమామిళ్ల రవికిరణ్,శుభమ్, లడ్డు, కిషోర్‌రెడ్డి, వెంకీ, అభిద్, వాసు, మజ్జు, కమిటీ అధ్యక్షులు శానం విజరు కుమార్, రాకేష్ దత్త, దుర్గా, శ్రీశ్రీ, ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
అన్నదానం మహాదానం :ఎస్సై
నవతెలంగాణ - బోనకల్
అన్ని దానాలలో కంటే అన్నదానం మహాదానమని ఎస్సై తేజావత్ కవిత అన్నారు. మండల పరిధిలోని రావినూతల బడి తండాలో తొమ్మిది రోజుల పాటు దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్వహించారు. చివరి రోజు అయిన మంగళవారం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమాన్ని ఎస్సై తేజావత్ కవిత ప్రారంభించారు. కార్యక్రమంలో రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేంద్ర, ఎంపీటీసీ కందిమల్ల రాధ, మాజీ సర్పంచ్ గుగులోతు పంతు, తండానాయకులు భానోత్ మాన్యా నాయక్, అన్నదానానికి సహకరించిన బానోత్ సివాలా నాయక్, కుమారులు బానోతు రమేష్, భానోత్ సురేష్, గుగులోతు శారద, భానోత్ వెంకటేశ్వర్లు, గుగులోతు నరేష్, భానోత్ నాగేశ్వరావు, భానోత్ శీను, గుగులోతు రూప్ల, భానోత్ కృష్ణ, ధరావత్ నరేష్ తదితరులు పాల్గొన్నారు.