Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మ దహనం
నవతెలంగాణ-తల్లాడ
నల్లచట్టాల రద్దు సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, అఖిలభారత రైతు సంఘాలు ఇచ్చిన పిలుపుమేరకు తల్లాడలో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను మంగళవారం దహనం చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు శీలం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఉద్యమ కాలంలో రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని, లకింపూర్ ఘటన బాధ్యులపై కఠిన చర్య తీసుకోవాలని, ఉద్యమ కాలంలో మరణించిన రైతులకు నష్టపరిహారం అందించాలని, కనీస మద్దతు ధర చట్టం చేయాల న్నారు. కార్యక్రమం లో ఎస్కేయం నాయకులు షేక్ లాల్మియా, అయినాల రామలిం గేశ్వరరావు, కే.వెంకటే శ్వర్లు, నల్లమోతు మోహన్ రావు, సాయిని ప్రకాష్‌రావు, పులి కృష్ణయ్య, ఆదోన, జీవరత్నం, షేక్ నన్నేసాహెబ్, సత్తెనపల్లి నరేష్ తదితరులు పాల్గొన్నారు.