Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనుమతులు సక్రమంగా లేవంటూ కోర్టులో కేసు వేసిన మాజీ ఐఏఎస్
నవతెలంగాణ- సత్తుపల్లి
సింగరేణి సంస్థకు చెందిన సత్తుపల్లి మండలంలోని కిష్టారం ఓసీ నియమ, నిబంధనలకు విరుద్ధంగా పర్యావరణ అనుమతులు పొందిందని విశాఖపట్టణానికి చెందిన మాజీ ఐఏఎస్ అధికారి ఈఏఎస్ శర్మ చెన్సైలోని నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్ కోర్టు (ఎన్జీటీ)లో 2019 సంవత్సరంలో కేసు దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలను క్షుణ్ణంగా పరిశీలించిన నేషనల్ గ్రీన్ కోర్టు న్యాయమూర్తులు కె.రామకృష్ణన్, సత్యగోపాల్ కొర్లపాటిలు కేసును కొట్టివేస్తూ గత నెల 29వ తేదీన తుదితీర్పు ఆస్తూ బంగళవారం ఆర్డర్ కాపీలను అందించినట్లు కిష్టారం ఓసీ, జేవీఆర్ పీవోలు నరసింహారావు, వెంకటాచారిలు మంగళవారం విలేకర్లకు తెలిపారు. మాజీ ఐఏఎస్ అధికారి శర్మ కిష్టారం ఓసీపై అనుమతులు సరిగా లేవంటూ ఆయన కోర్టుకు వెలిబుచ్చిన అంశాలను పీవోలు విలేకర్లకు ఈ క్రింది విధంగా వివరించారు. అటవీ అనుమతులు లేవని, ప్రజాభిప్రాయ సేకరణ సరిగా చేపట్టలేదని, జగన్నాధపురం గ్రామంలో సామాజిక, ఆర్థిక సర్వే జరిగా చేయలేదని, గుడిపాడు గ్రామంలో గాలి నాణ్యత గురించి పట్టించుకోవడం లేదని, భూగర్భ జలాల పెెంపుదలలో జాగ్రత్తలు తీసుకోవడం లేదని, నీటి సరఫరాలో ఫ్లోరైడ్ ఉందని, రైల్వే స్లైడింగ్ వేయలేదని తదితర కారణాలతో అటవీ జంతువులు అంతరించిపోయే అవకాశం ఉందంటూ 11 అంశాలతో కూడిన ఫిర్యాదులను ఎన్జీటీ కోర్టుకు అందించారు. న్యాయమూర్తులు పైన తెలిపిన అంశాలను పరిశీలించి కేసులో పసలేనందున కొట్టివేసినట్లు పీవోలు నరసింహారావు, వెంకటాచారి తెలిపారు. ప్రభావిత ప్రాంతాల్లో సింగరేణి సంస్థ అనేక హెల్త్క్యాంపులు, శిక్షణా శిబిరాలు, నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు, సీఎస్ఆర్ నిధులతో పలు అభివృధ్ధి కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. సమావేశంలో మేనేజర్ వెంకటేశ్వరరావు, వెల్ఫేర్ ఆఫీసర్ విజయసందీప్ పాల్గొన్నారు.