Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
బోనకల్ ప్రాథమిక వ్యవసాయ పరపతి సహకార సంఘంలో రైతులకు కొత్త రుణాలను సొసైటీ అధ్యక్షులు చావా వెంకటేశ్వరరావు మంగళవారం బోనకల్ సొసైటీ నందు రైతులకు పంపిణీ చేశారు. బోనకల్లు సొసైటీ పరిధిలోనే మొత్తం 56 మందికి రైతులకు 28 లక్షల రూపాయలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా చావా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ బోనకల్ సొసైటీ అభివృద్ధికి పాలకవర్గంతో పాటు రైతుల కూడా కృషి చేయాలని కోరారు. రైతులు తీసుకున్న రుణాలను సకాలంలో చెల్లించి సహకార సంఘ అభివృద్ధికి కృషి చేయాలని కోరారు. తాను సొసైటీ అధ్యక్షుడిగా ఎన్నికైన దగ్గర నుంచి సహకార సంఘ అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నట్లు తెలిపారు. సొసైటీ పరిధిలోగల బోనకల్, చిరునోముల గ్రామాలకు చెందిన అర్హత కలిగిన రైతులందరికీ రుణాలు అందజేయనున్నట్లు తెలిపారు. బోనకల్ సొసైటీలో అన్ని రకాల ఎరువులు ఉన్నాయని తెలిపారు. అయితే కొంతమంది రైతులు సహకార సంఘాలలో ఉన్న ఎరువులను కొనుగోలు చేయకుండా ప్రైవేటు షాపులలో కొనుగోలు చేస్తున్నారని, దీనివలన రైతులకే నష్టమన్నారు. సహకార సంఘాల ద్వారా లభ్యమవుతున్న ఎరువులను మాత్రమే రైతుల కొనుగోలు చేయాలని ఆయన కోరారు. కార్యక్రమంలో డిసిసిబి బోనకల్ బ్రాంచ్ మేనేజర్ షేక్ షిరీన్, సూపర్వైజర్ షేక్ బాజీ, ఆ సంఘం సీఈవో మండేపూడి వెంకటేశ్వరరావు, సొసైటీ డైరెక్టర్లు గుండపనేని సుధాకర్ రావు, గంగుల పుల్లయ్య, మోర్ల శ్రీనివాసరావు, నందమూరి సత్యనారాయణ, వరుగు ఐతం రాజు, చిరునోముల మాజీ ఎంపీటీసీ నిమ్మ తోట ఖానా బోనకల్ ఉపసర్పంచ్ యార్లగడ్డ రాఘవరావు సొసైటీ సిబ్బంది అంబటి సంపత్ కుమార్ రైతులు పాల్గొన్నారు.
చిరునోముల కు సొసైటీ గోడౌన్ మంజూరు:బోనకల్ సొసైటీ పరిధిలోనే చిరునోముల గ్రామానికి 500 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోడౌన్ మంజూరైనట్లు ఆ సంఘం అధ్యక్షుడు చావా వెంకటేశ్వరరావు తెలిపారు. గోడౌన్ నిర్మాణానికి నాబార్డు నుంచి నిధులు మంజూరైనట్లు ఆయన తెలిపారు. త్వరలోనే గోడౌన్ నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నట్లు ఆయన తెలిపారు.