Authorization
Sun April 06, 2025 06:05:38 pm
నవతెలంగాణ-బూర్గంపాడు
మండలంలోని గోదావరి వరద బాధిత గ్రామాలను పోలవరం ముంపు గ్రామాలుగా గుర్తించి, 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఆర్.ఆర్. పరిహారం అందించాలని, పోలవరం ప్రాజెక్టు నిర్మాణాన్ని నిలిపివేయాలని బూర్గంపాడులో చేపట్టిన జేఏసీ రిలే నిరాహార దీక్షలు మంగళవారం నాటికి 47వ రోజుకు చేరుకున్నాయి. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ బూర్గంపాడు మండలంలోని ముంపు ప్రాంతాలకు పోలవరం ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. వరుస గోదావరి వరదలతో అతలాకుతలం అవుతున్న మండల ప్రజలకు పోలవరం ప్యాకేజీతోనే శాశ్వత పరిష్కారం లభిస్తుందని అన్నారు. ఈ దీక్షలో కేవి రమణ, పూలపెల్లి సుధాకర్ రెడ్డి, ఎస్కే నజీదుద్దీన్, గోనెల నరసింహారావు, వెంకటేశ్వర్ రెడ్డి, ఆటో శ్రీను, ఎస్కే గౌస్య బేగం, ఎస్కే రహి మున్నిసా బేగం, తదితరులు దీక్షలో కూర్చున్నారు.