Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రారంభించిన చెన్నకేశవరావు
- హాజరైన తాటి, ఆలపాటి
నవతెలంగాణ-అశ్వారావుపేట
మునుగోడు ఎన్నికల ప్రభావం అశ్వారావుపేటలో కనిపిస్తుంది. టీఆర్ఎస్ కాస్తా బీఆర్ఎస్గా మార నుండటంతో ఆ పార్టీ శ్రేణులు జ్యోష్గా ఉన్నారు. ఈ క్రమంలో కాంగ్రెస్ మండల కమిటీ ఆద్వర్యంలో సత్తుపల్లి రోడ్ కార్యాలయం ఏర్పాటు చేసారు. గురువారం మండల అధ్యక్షుడు మొగుళ్ళపు చెన్నకేశవరావు ప్రారంభించారు. అనంతరం హాజరైన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు నియోజకవర్గం స్థాయిలో మరో కార్యాలయం ఏర్పాటు చేయనున్నట్టు ప్రకటించడంతో పార్టీ శ్రేణులు అయోమయంలో పడ్డాయి. మరి కొద్ది సమయానికి స్థానిక సీనియర్ నాయకులు ఆలపాటి రాంమోహన్ రావు(రాము) కార్యాలయానికి చేరుకు ని త్వరలో తానూ క్రియాశీలంగా పార్టీ వ్యవహారాలను చూడనున్నట్లు తెలిపారు. ప్రస్తుతానికి అశ్వారావు పేటలో సీపీఐ, సీపీఐ(ఎం), సీపీఐ ఎంఎల్ ఎన్డీ (ప్రజా పంథా)లకు మాత్రమే పార్టీ శాస్వత కార్యాల యాలు ఉన్నాయి. కాంగ్రెస్, తెలుగు దేశం, తెరాసలు మాత్రం ఎన్నికల సమయంలో తాత్కాలిక కార్యాల యాలు ఏర్పాటు చేసుకుం టాయి. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ వేముల భారతి, సత్యవరపు తిరుమల, వగ్గెల అనసూయ, జెడ్పీ టీసీ మాజీ సభ్యులు అంకత మల్లికా ర్జున్ రావు, ఆసుపాక మాజీ సర్పంచ్ పొట్టా రాజులు, నాయకులు చిన్నం శెట్టి రామక్రిష్ణ, దంజు నాయక్, వగ్గెల పూజ, రాంబాబు పాల్గొన్నారు.