Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రెవెన్యూ డివిజన్ కొత్త మండలాలు ప్రకటించండి
- సాధన, అఖిలపక్ష కమిటీల డిమాండ్
నవతెలంగాణ-ఇల్లందు
2016లో జిల్లాల పునర్విభజన చేయడంతో ఇల్లందు పూర్వ వైభవాన్ని కోల్పోయి మొండెంగా మిగిలిందని, రెవెన్యూ డివిజన్ కొత్త మండలాలు ప్రకటించాలని, సాధన అఖిలపక్ష కమిటీల డిమాండ్ చేశాయి. స్థానిక కార్యాలయంలో గురువారం సాధన కమిటీ సమావేశం నిర్వహించారు. దేవులపల్లి యాకయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, తెలంగాణ జనసమితి రాష్ట్ర నేత గోపగాని శంకర్ రావు, సాధన కమిటీ కన్వీనర్ అబ్దుల్ నబిల మాట్లాడారు. అత్యంత ఎక్కువ గిరిజన జనాభా కలిగిన తెలంగాణ రాష్ట్రంలో పెద్ద గిరిజన నియోజకవర్గమైన ఇల్లందును గుండాల, కరకగూడేం, ఆళ్ళపల్లి, టేకులపల్లి, ఇల్లందు, బోడు, కొమరారం, సుదిమళ్ళ మండలాలతో రెవెన్యూ డివిజన్ చేసి కోమరారం, బోడు, సుది మళ్ళలను కొత్త మండలాలుగా ఏర్పాటు చేయాలని కోరుతూ అఖిల పక్షం డిమాండ్ డిమాండ్ చేస్తోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ నియోజకవర్గాన్ని మూడు జిల్లాల్లోకి వెళ్లే విధంగా మార్పులు చేసిందన్నారు. దాంతో ఇల్లందుకు తీరని నష్టం జరిగింది. ఇప్పటికైనా సీఎం కేసీఆర్ స్పందించి ఇల్లందు రెవెన్యూ డివిజన్ కొత్త మండలాలు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సాధన కమిటీ సభ్యులు కాంగ్రెస్ బత్తుల వెంకట నారాయణ, టీడీపీ చాందావత్ రమేష్, సీపీఐ ఎమ్ఎల్ ప్రజాపంథా నాయిని రాజు, వైఎస్ఆర్టిపీ నాగారపు రాములు, బీఎస్పీ చిప్పలపల్లి శ్రీనివాస్, తెలంగాణ జనసమితి భద్రు నాయక్, గుండెటి శివ తదితరులు పాల్గొన్నారు.