Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యనమదల విక్రమ్ తండ్రి యనమదల జోషి చిత్రపటానికి బుధవారం పలువురు, వివిధ రంగాల ప్రముఖులు నివాళులర్పించారు. మండల పరిధిలోని రావినూతలలో వై.విక్రమ్ నివాసంలో జోషి చిత్రపటానికి నాయకులు నివాళులర్పించారు. సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, రాష్ట్ర కమిటీ సభ్యులు కానురి హిమబిందు, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు మాచర్ల భారతి, జిల్లా నాయకులు దొంగలు తిరుపతి రావు, నవీన్ రెడ్డి, ఎంఏ జబ్బార్, గోపాలరావు, సిపిఎం బోనకల్ మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, బి.వి.కె ట్రస్ట్ మేనేజర్ ఎనగండ్ల శ్రీనివాసరావు, రిటైర్డ్ ఉద్యోగ సంఘం నాయకులు వెంకటేశ్వరరావు, శ్రీదేవి, గ్రైనైట్ ఖమ్మం జిల్లా నాయకులు తాళ్ళురి మధు, ఆర్ఆర్ హైస్కూల్ అధినేత ప్రసాద్, అంబటిపూడి సుధాకర్, నాదెండ్ల శ్రీనివాస్, బోనకల్ మండల నాయకులతో పాటు జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యనమదల విక్రమ్ తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా నున్నా నాగేశ్వరరావు మాట్లాడుతూ యనమదల జోషి క్రమశిక్షణ కలిగిన మంచి వ్యక్తి అన్నారు. కుటుంబాన్ని మొత్తాన్ని కమ్యూనిస్టు ఉద్యమంలో ఉండే విధంగా తయారు చేశాడన్నారు. రెండవ కుమారుడు విక్రమ్ ఖమ్మం జిల్లాలో సిపిఎంలో ప్రధాన బాధ్యుడిగా వ్యవహరిస్తున్నారన్నారు. జిల్లా ఉద్యమాలలో ప్రధానమైన పాత్ర నిర్వహిస్తూ, ప్రజా ఉద్యమాలలో కీలక పాత్ర నిర్వహిస్తున్నాడని తెలిపారు. జోషి మృతి చాలా బాధాకరమని నివాళులర్పించారు.