Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కార్యకర్తలు, నాయకులు మధ్య లొల్లి
నవతెలంగాణ-ముదిగొండ
తెలంగాణ రాష్ట్ర సమితి(టిఆర్ఎస్) పార్టీ అధ్యక్షులు, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భారత్ రాష్ట్ర సమితి (బిఆర్ఎస్) జాతీయ పార్టీని ప్రకటించటాన్ని హర్షిస్తూ గురువారం ముదిగొండలో టిఆర్ఎస్ పార్టీ మండల కమిటీ ఆధ్వర్యంలో టపాసులు పేల్చి, స్వీట్లు పంచి సంబరాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, ఎంపీపీ సామినేని హరిప్రసాద్ రైతు సమన్యయసమితి మండల కన్వీనర్ పొట్ల ప్రసాద్, టిఆర్ఎస్ పార్టీ మండల ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకట్ తదితరులు పాల్గొన్నారు.
అధికార పార్టీలో లొల్లి....
ముదిగొండ ప్రధాన సెంటర్లో టిఆర్ఎస్ పార్టీ శ్రేణులు టపాసులు పేల్చిన అనంతరం అధికార పార్టీ నేతల మధ్య రోడ్డుమీద లొల్లి జరిగింది. ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. ముదిగొండ, సువర్ణాపురం గ్రామశాఖల అధ్యక్షులు తేరాల రామారావు, తోట ధర్మారావు, మండల పార్టీ అధ్యక్షులు వాచేపల్లి లక్ష్మారెడ్డి, రైతు సమన్యయ సమితి మండల కన్వీనర్ పోట్ల ప్రసాద్‌తో పార్టీ కార్యక్రమంలో నిర్వహించేటప్పుడు సమాచారం ఇవ్వడం లేదని ఆవేదనతో వాగ్వాదానికి దిగారు. గ్రామ కమిటీల వారికి తెలియజేస్తే తాము కూడా కార్యక్రమానికి హాజరవుతామంటూ తెలియకుండా చేయడం సమంజసం కాదంటూ వారిపై అగ్రహం వ్యక్తం చేస్తూ నిలదీశారు. నాయకుల, కార్యకర్తల మధ్య జరుగుతున్న వాగ్వావాదం, వాదోపోదాలను స్థానికులు ఆసక్తిగా తిలకించారు. ఈలొల్లి మండలంలో చర్చనీయాంశంగా మారింది.