Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొణిజర్ల
ఆర్టీసి బస్సు ఢకొని మండల పరిధిలోని మెకాలకుంట గ్రామ సర్పంచ్ గుగులోత్ నరసింహ అక్కడక్కడే మృతి చెందాడు. దసరా పండగ సందర్భంగా బుధవారం బంధు మిత్రులకు శుభాకాంక్షలు తెలిపి తన ద్విచక్ర వాహనంపై ఖమ్మం నుండి మెకాలకుంటకు తిరిగి వస్తుండగా కొణిజర్ల-తనికెళ్ళ గ్రామాల మధ్య ద్విచక్రవాహనాన్ని భద్రాచలం డిపోకు చెందిన ఆర్టీసి బస్సు ఢకొట్టింది. ఈ ప్రమాదంలో నరసింహ అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అనంతరం కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ టి యయాతి రాజ్ తెలిపారు. మృతదేహాన్ని చూసి ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ కంటతడి పెట్టారు. అనంతరం నరసింహ భార్య, కూమారుడు, కూతురు, తల్లిని ఓదార్చారు. అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన తండాకి మొట్ట మొదటి సర్పంచ్ గా ప్రజలు ఏకగ్రీవంగా నరసింహను ఎన్నుకున్నారని గుర్తుచేస్తూ కంటతడి పెట్టారు. నరసింహా మృతి కుటుంబానికి, పార్టీకి, గ్రామస్తులకు తీరని లోటన్నారు. మృతదేహాన్ని కాంగ్రెస్ వైరా నియోజకవర్గ నాయకులు బాణోత్ బాలాజీ, పీసీసీ సభ్యులు సూరంపల్లి రామారావు, సీపీఎం వైరా నియోజకవర్గ ఇంచార్జ్ భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బొంతు రాంబాబు, రాష్ట్ర మార్క్ఫెడ్ వైస్ ఛైర్మన్ బొర్రా రాజశేఖర్, జిల్లా కమిటీ సభ్యులు తాళ్లపల్లి క్రిష్ణ, మండల కార్యదర్శి చెరుకుమల్లి కుటుంబరావు, జడ్పీటీసీ పోట్ల కవిత, జిల్లా నాయకులు పోట్ల శ్రీనివాస్ రావు, వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాస్ రావు, మండలా ద్యక్షుడు వై చిరంజీవి, జిల్లా నాయకులు ఏలూరి శ్రీనివాస్ రావు, కీలారు మాధవరావు, డి.రామారావు, పోగుల శ్రీను, సర్పంచుల సంఘం మండలాధ్యక్షుడు చల్లా మోహన్ రావు, పూల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు సందర్శించి నివాళ్లర్పించారు. ఖమ్మం ప్రభుత్వ ఆస్పత్రిలో తెలంగాణ రాష్ట్ర ఇన్కామ్ ట్యాక్స్ అధికారి లావుడియా జీవన్ లాల్ సందర్శించి నరసింహ మృతికి సానుభూతి తెలిపారు. సర్పంచ్ నరసింహకు భార్య కమల, కుమారుడు నితిహస్, కూతురు మోక్షీత ఉన్నారు.