Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వాస్తవాలు తెలియజేయాలి, కార్మిక ఐక్యతను కూడగట్టాలి
- జేఏసీ పిలుపు
నవతెలంగాణ-కొత్తగూడెం
సింగరేణి కాంట్రాక్ట్ కార్మికులను గందరగోళపరచొద్దని, వాస్తవాలు తెలియజేయాలని జేఏసీ నాయకులు తెలిపారు. గురువారం కొత్తగూడెం ఏరియాలోని ఆర్‌సీహెచ్‌పీ వద్ద రోడ్డు క్లీనింగ్ కాంట్రాక్ట్ కార్మికుల జనరల్ బాడీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా జేఏసీ నాయకులు గుత్తుల సత్యనారాయణ, యర్రగాని కృష్ణయ్యలు మాట్లాడుతూ సింగరేణిలో 18 రోజులు పాటు జరిగిన సమ్మె సందర్భంగా యాజమాన్యంతో జరిగిన ఒప్పందం విషయంలో కానీ, పెనాల్టీల విషయంలో కానీ, వాస్తవ విషయాలను కార్మికులకు తెలియజేయాలన్నారు. భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికుల సమస్యల పరిష్కారానికి, హక్కుల సాధనకు జరగబోయే ఉద్యమాలకు కార్మిక ఐక్యతను కూడగట్టవలసిన బాధ్యత కార్మిక సంఘాలపై ఉంటుందన్నారు. సింగరేణి వ్యాపితంగా 18 రోజులపాటు పట్టుదలతో ఐక్యంగా పోరాడిన కాంట్రాక్టు కార్మికులకు అభినందనలు తెలియజేశారు. సమ్మె పోరాట ఫలితంగా జరిగిన అగ్రిమెంటును అమలు చేయించుకోవడానికి అందరం కలిసి కృషి చేయాలని పిలుపు నిచ్చారు. ఈ అగ్రిమెంట్లో ఉన్నటువంటి విషయాలను కాంట్రాక్ట్ కార్మికులకు వివరించారు. వాటి అమలు కోసం ప్రతి అంశానికి నోట్ పైలు పెట్టాలని, సర్క్యులర్స్ విడుదల కావాల్సి ఉన్నదని తెలిపారు. ప్రభుత్వంతో కానీ, కంపెనీ యాజమాన్యాలతో గాని ఒప్పందాలు జరిగినప్పుడు ఒప్పందం ఆధారంగా సర్క్యులర్స్ విడుదలైన తర్వాత అమలు చేస్తారని ఈ విషయాన్ని ప్రతి ఒక్కరు గమనించాలని తెలిపారు. పెనాల్టీల విషయంలో అగ్రిమెంట్లో పేర్కొన్న విధంగానో వర్క్, నోపే, నోపేల్టీస్ సర్క్యులర్ తొందర్లోనే వస్తుందని ఎవ్వరూ ఆందోళన చెందవద్దని తెలిపారు. కార్మిక సంఘాలు ఐక్యంగా పోరాడిన ఫలితంగానే సింగరేణి యాజమాన్యం డైరెక్ట్‌గా కాంట్రాక్ట్ కార్మిక సంఘాలతో ఒప్పందం చేసుకుందని, ఇది చట్ట బద్ధమైన ఒప్పందం అని, ఈ ఒప్పందం ఫలితంగా కాంట్రా క్టు కార్మికులకు వేతనాలు పెరుగుదల, బోనస్ పెరుగుదల ఇతర సంక్షేమ పథకాలు అమలు జరిగే విధంగా జేఏసీ అగ్రి మెంట్ చేసిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జె.అనిల్, లక్ష్మయ్య, వెంకటేశ్వర్లు, నరసయ్య తదితరులు పాల్గొన్నారు.