Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 14న గుండాలలో బహిరంగ సభ
- విలేకరుల సమావేశంలో ఎన్డీ, ఏఐకేఎంఎస్ నాయకులు
నవతెలంగాణ-ఇల్లందు
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన అటవీ సంరక్షణ నియమాలు 40 దేశంలోని కోట్లాది మందికి ప్రమాదమని సీపీఐ (ఎంఎల్)న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, అఖిలభారత రైతు కూలీ సంఘం (ఏఐకేఎంఎస్) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మండల వెంకన్న, గుండాల ఎంపీపీ ముక్తిసత్యం అన్నారు. వీటిని నిరసిస్తూ 14న గుండాలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. స్థానిక కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత దేశాన్ని అమ్మకాలకు ప్రయోగశాలగా మార్చిందని అన్నారు. ఆదివాసుల సంస్కృతి సంప్రదాయాలను మట్టుబెట్టేవిగా ఉన్నాయన్నారు. పెట్టుబడిదారుల వర్గాల ప్రభుత్వాల చేతుల్లో ఆదివాసీల మనుగడ ప్రమాదపు అంచున ఉందన్నారు. అనంతరం బహిరంగ సభ గోడపత్రికను ఆవిష్కరించారు. ఈ సమావేశంలో ఏఐకెఎమ్ఎస్ రాష్ట్ర నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, న్యూడెమోక్రసీ ఇల్లందు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు, ఇఫ్టు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి, జిల్లా ఉపాధ్యక్షులు గౌని నాగేశ్వరరావు, ఎంపీటీసీ ఈసాల పాపమ్మ, సర్పంచులు వాంకుడోత్ సరోజన, బాణోత్ సంతు, మోకాళ్ళ కృష్ణ, ఏఐకేయంయస్ జిల్లా నాయకులు బట్టు ప్రసాద్, ఎట్టి నరసింహారావు, సూర్ణపాక నాగేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.