Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-కొత్తగూడెం
కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి విజయదశమి ఉత్సవాల్లో పాల్గొనడానికి తన స్వగ్రామం మల్లాపూర్ మండలం చిట్టాపూర్‌కు కుటుంబ సమేతంగా విచ్చేసారు. పని ఒత్తిడిలో ఉన్నా ఆయన తన మాతృ భూమిపై మమకారంతో పుట్టిన ఊరికి విచ్చేసి తన బంధుమిత్రులు, గ్రామస్తులతో కలిసి సరదాగా గడిపారు. ఈ సందర్భంగా గ్రామంలో యువకులు, విద్యార్థులు, నాయకులు కలెక్టర్ అనుదీప్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు. చిన్ననాటి స్నేహితులు కలిశారు. మారుమూల పల్లె నుండి తమ బిడ్డ ఇంతటి ఉన్నత స్థానానికి ఎదిగినందుకు మాకు గర్వంగా ఉందని గ్రామస్తులు కొనియాడారు. ఈ సందర్భంగా అనుదీప్‌ను ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. భద్రాద్రి జిల్లాలో గోదావరి వరదల సందర్భంగా అద్భుతమైన పనితీరు కనబరిచారని, ఒక్క ప్రాణ నష్టం లేకుండా విధుల నిర్వహణ చేసి ముఖ్యమంత్రి మన్ననలు, ప్రసంసలు పొందడం ఎంతో గర్వకారణంగా ఉందని, స్వచ్ఛ సర్వేక్షన్ గ్రామీన్ పురస్కారాల్లో దేశంలో 750 జిల్లాల్లో భద్రాద్రి జిల్లాను మూడో స్థానంలో నిలబెట్టి కేంద్ర జలశక్తి మంత్రి గజేంద్రసింగ్ షేకావత్ చే అవార్డు తీసుకోవడం ఎంతో సంతోషంగా ఉందని గ్రామస్తులు కలెక్టర్‌కు అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సాయికుమార్, ఎంపీటీసీ లక్ష్మీ, సింగిల్ విండో చైర్మన్ మోహన్ రెడ్డి, మైలారం సురేష్, రాజారెడ్డి, శీను, కలెక్టర్ తండ్రి ఏడీఈ మనోహర్, నాయకులు, రైతులు, పాల్గొన్నారు.