Authorization
Sun April 06, 2025 10:23:21 pm
నవతెలంగాణ - బోనకల్
మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన సీపీఐ(ఎం)జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు యనమదల విక్రమ్ తండ్రి యనమదల జోషి చిత్రపటానికి మంగళవారం రావినూతలలో పలువురు ప్రముఖులు నివాళులర్పించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అలుగుబెల్లి నర్సిరెడ్డిలు జోషి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జోషి భార్య లీల కుమారులు వేణు, విక్రమ్‌లను పరామర్శించారు. జోషి మృతికి గల కారణాలను కుమారులను అడిగి తెలుసుకున్నారు. ఖమ్మం జూబ్లీ క్లబ్ అధ్యక్షుడు పోట్ల శ్రీకాంత్, సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కార్యదర్శి అనవరపు కనకయ్య, సిపిఎం ఖమ్మం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యర్రా శ్రీకాంత్, భూక్యా వీరభద్రం, జిల్లా కమిటీ సభ్యులు యర్రా శ్రీనివాసరావు, సిపిఎం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ, గొర్రెల మేకల పెంపకం దారుల సంఘం జిల్లా అధ్యక్షులు తుషాకుల లింగయ్య, సిపిఎం ఖమ్మం మున్సిపాలిటీ మాజీ ఫ్లోర్ లీడర్ బండారు యాకయ్య, సిపిఎం మండల కార్యదర్శి దొండపాటి నాగేశ్వరరావు, సిపిఎం ఖమ్మం వన్ టౌన్ కార్యదర్శి ఎంఏ జబ్బార్, గిరిజన సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు గుగులోతు పంతు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు వత్సవాయి జానకి రాములు, నవీన్‌రెడ్డి, ఎం.గోపాలరావు, బాలరాజు, గుగులోతు నరేష్, నవతెలంగాణ సిబ్బంది భూక్యా కృష్ణ, పలువురు ఉపాధ్యాయులు నివాళులర్పించారు.