Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఇంటింటికీ వ్యకాస కరపత్రం
నవతెలంగాణ-నేలకొండపల్లి
డిసెంబర్ 5, 6, 7 ఖమ్మంలో జరగనున్న తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం 3వ రాష్ట్ర మహాసభలు జయప్రదం కోరుతూ వ్యవసాయ కార్మిక సంఘం మండల కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండలంలోని కొంగర గ్రామంలో విస్తృత ప్రచారం నిర్వహించారు. మహాసభల ప్రాధాన్యతను వివరిస్తూ ముద్రించిన కరపత్రాన్ని ఇంటింటికీ పంపిణీ చేశారు. తొలుత గ్రామంలోని ప్రధాన సెంటర్లో వ్యవసాయ కార్మిక సంఘం జెండాను సంఘం మండల అధ్యక్షులు కేవీ రామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత అనేక ఏళ్లుగా వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన ఐక్య పోరాటాల ద్వారా వ్యవసాయ కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలలో కొంతవరకు పరిష్కరించుకోగలిగినా అనేక సమస్యలు వేధిస్తున్నాయన్నారు. నేడు ప్రభుత్వాలు అనుసరిస్తున్న రైతాంగ వ్యతిరేక విధానాల వల్ల వ్యవసాయం తీవ్ర సంక్షోభంలోకి కూరుకుపోతుం దన్నారు. ఈ నేపథ్యంలో వ్యవసాయ కార్మికుల జీవన పరిస్థితులు మెరుగుపరిచేందుకు, రైతుల సమస్యల పరిష్కారానికై ఈ మహాసభలలో చర్చించి ఉద్యమ కార్యాచరణ రూపొందించ నున్నట్లు ఆయన తెలిపారు. ప్రచార కార్యక్రమంలో రైతు సంఘం రాష్ట్ర నాయకులు గుడవర్తి నాగేశ్వరరావు, పగిడికత్తుల నాగేశ్వరరావు, దుగ్గి వెంకటేశ్వర్లు, సిరికొండ ఉమామహేశ్వరి, మారుతి కొండలరావు, భూక్య కృష్ణ, వై.నరసింహారావు, ఎస్కే మహిముద్, మాగి నాగబాబు తదితరులు పాల్గొన్నారు.