Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సర్వేని అడ్డుకున్న రైతులు, అఖిలపక్ష పార్టీలు
- గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూనిర్వాసిత రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-రఘునాధపాలెం
భూములివ్వం... సర్వేకి రావద్దు అంటూ నాగపూర్ నుండి అమరావతి గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే భూ నిర్వాసిత రైతులు ఆందోళన చేశారు. సర్వేకొచ్చిన అధికారులను, నేషనల్ హైవే ఉద్యోగస్తులను వి.వెంకటాయపాలెం, కొదుమూరు రోడ్డు నందు అడ్డుకున్నారు. బలవంత భూసేకరణకు వ్యతిరేకంగా రోడ్డుపై రాస్తారోకో నిర్వహించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు ఎస్.నవీన్‌రెడ్డి, సిపిఐ జిల్లా నాయకుడు గోవిందరావు మాట్లాడుతూ బహుళ పంటలు పండే భూమిని హైవేల పేరుతో గుంజుకోవటం సరైంది కాదన్నారు. ఖమ్మం నగర విస్తరణకు ఆటంకం కలిగే పద్ధతిలో ఉన్న నేషనల్ హైవే అలైన్మెంట్ని మార్చాలని డిమాండ్ చేశారు. భవిష్యత్తులో బలవంతపు సేకరణకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటం నిర్వహిస్తామని హెచ్చరించారు. రైతుల ఆందోళన వద్దకు ఆర్డిఓ రవీంద్రనాథ్ రాగా వారితో చర్చలు జరిపి అనంతరం వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో భూ నిర్వాసిత జేఏసీ కన్వీనర్ తక్కెళ్లపాటి భద్రయ్య, వేముల సతీష్, నాగండ్ల శ్రీధర్, జంగాల శ్రీనివాస్, పెంట్యాల వెంకటేశ్వర్లు. వీరబాబు పాల్గొన్నారు.