Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి
నవతెలంగాణ-కొత్తగూడెం
బాలికలు విద్యతో పాటు, హక్కులు, వాటి రక్షణ గురించి తెలుసు కోవాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. అంతర్జాతీయ బాలికా దినోత్సవాన్ని పురస్కరించుకొని స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో జరిగిన కార్యక్రమంలో ముందుగా గోడ పత్రిక ఆవిష్కరించారు. అనంతరం ఫ్లెక్సీపై సంతకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవకాశాలు కల్పిస్తే బాలికలు అన్ని రంగాలలో రాణిస్తారని, నేడు అన్ని రంగాలలో మహిళలు రాణిస్తున్నారని సాధించలేనిది ఏమీ లేదని కలెక్టర్ అన్నారు. ప్రపంచ జనాభాలో సగ భాగం మహిళలు ఉన్నారని, ఏ విషయంలోనూ ఆడపిల్లలు తక్కువ అని భావించరాదన్నారు. ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ అధికారి వరలక్ష్మీ, హరికుమారి, హసీనా, శివ కుమారి, సిడబ్ల్యుసి సభ్యులు సాదిక్ పాషా, సుమిత్రాదేవి తదితరులు పాల్గొన్నారు.