Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
భద్రాచలం పట్టణం నెహ్రూ మార్కెట్ సెంటర్ వద్ద ఏర్పాటుచేసిన ప్రజా మరుగుదొడ్లు సంవత్సర కాలంగా కార్మికులకు ఎటువంటి ఉపయోగం లేకుండా మూసివేయటం వలన కార్మికులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని శ్రామిక మహిళా పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక అన్నారు. మహిళలు ఇక్కడ మరుగుదొడ్డు సౌకర్యం లేకపోవడం వలన ఆర్టీసీ బస్టాండ్ వరకు వెళ్లాల్సి వస్తుందని దీని వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. వెంటనే అధికారులు స్పందించి గ్రామపంచాయతీ నుంచే ఈ ప్రజా మరుగుదొడ్లు ఉపయోగంలోకి వచ్చేలా చూడాలని ఆమె డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కార్మికులు సత్యవేణి, కళావతి, నస్రిన్, కౌసల్య, కామేశ్వరి, సుబ్రమణ్యం, విష్ణు, పద్మ తదితరులు పాల్గొన్నారు.