Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- స్థానిక సంస్థలు వికలాంగుల అభ్యున్నతికి కృషి చేయాలి
- టీవీపీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు, వీజేఏసీ చైర్మెన్ సతీష్ గుండపునేని
నవతెలంగాణ-కొత్తగూడెం
ఎలక్ట్రానికల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) సిఎస్ఆర్ నిధులుతో అలింకో సంస్థ, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సంక్షేమ శాఖ సంయుక్తంగా ఆధ్వర్యంలో ఈనెల 12, 13, 14 తేదీలలో జిల్లాలో నిర్వహించే దివ్యాంగుల సహాయ పరికరాల ఎంపిక శిబిరాన్ని వికలాంగులందరూ సద్వినియోగం చేసుకోవాలని తెలంగాణ విభిన్న ప్రతిభావంతుల సంఘం (టివిపిఎస్) వ్యవస్థాపక అధ్యక్షులు, విజేఏసి చైర్మన్ సతీష్ గుండపునేని పిలుపు నిచ్చారు. మంగళవారం స్థానిక బస్టాండ్ సెంటర్లోని సంఘ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా వికలాంగులకు పూర్తిస్థాయిలో సహాయ ఉపకరణాలు అందక అనేక ఇబ్బందులు పడుతున్నారని ఈ విషయంపై ఎలక్ట్రానికల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఈసీఐఎల్) వారు వికలాంగుల సహాయ పరికరాలైన ట్రై సైకిల్, వీల్ చైర్స్, వినికిడి యంత్రాలు, అంధుల చేతి కర్రలు, రోలోటర్స్, మానసిక వైకల్యంతో బాధపడే పిల్లలకు ఎంఆర్ కిట్స్, స్మార్ట్ కేన్, అందుల చేతి కర్రలు ఎల్బో క్రచ్చేస్, రోడ్డు ప్రమాదంలో కాళ్లు, చేతులు కోల్పోయిన వారికి కృత్రిమ అవయవాలు మొదలగు వివిధ రకాల సహాయ ఉపకరణాలు పంపిణీకి ముందుకు రావడం అభినందనీయమని, ఈనెల 12వ తారీఖున మణుగూరు మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో, 13వ తారీఖున ఇల్లందు మార్కెట్ యార్డ్లో, 14వ తారీఖున కొత్తగూడెం పాత కొత్తగూడెం నందు గల జిల్లా సంక్షేమ కార్యాలయంలో ఈ శిబిరం నిర్వహిస్తున్నారని, ఈ అవకాశాన్ని వికలాంగులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.