Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-భద్రాచలం
అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా భద్రాచలం పట్టణంలోని వెనుకబడిన తరగతుల వసతి గృహంలో మంగళవారం చట్టాలపై అవగాహనా సదస్సు నిర్వహించారు. మహిళా న్యాయవాది దాట్ల సంధ్య అధ్యక్షతన జరిగిన సదస్సులో ఆడపిల్లలని పుట్టనిద్దాం, చదవనిద్దాం, ఎదగానిద్దాం అనే అంశాలను విద్యార్థినీలకు న్యాయవాదులు వివరించారు. గర్భంలోని ఆడపిల్లని చిదిమెసే వారికి కఠినమైన శిక్ష ఉంటుందని లాయర్స్ అవులూరి సత్యనారాయణ, ఎం.వి రమణ, రాంబాబు, శివలు తెలుపుతూ ప్రస్తుతం అమల్లో ఉన్న కొన్ని చట్టాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ అపర్ణ, విద్యార్థినీలు తదితరులు పాల్గొన్నారు.
చండ్రుగొండ ఆడపిల్లలను రక్షించుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని ఐసీడీఎస్ సూపర్వైజర్లు రాణి, శకుంతల సూచించారు. మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని కస్తూర్బా గాంధీ బాలికల వసతి గృహం కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా బాల్య వివాహాల నిరోధక చట్టం, బాలికలపై లైంగిక వేధింపులు, గర్భస్థ శిశువు లింగ నిర్ధారణ, బేటీ బచావో, విద్య రక్షణ, సంరక్షణపై బాలికలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో కేజీబీవీ సూపర్డెంట్ శాంతకుమారి, టీచర్లు, సిబ్బంది, విద్యార్థునీలు తదితరులు పాల్గొన్నారు.
దుమ్ముగూడెం : బాలికలపై దాడులు లేని సమాజాన్ని నిర్మించుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పర్ణశాల సర్పంచ్ తెల్లం వరలక్ష్మి అన్నారు. మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా పర్ణశాల పంచాయతీలో గల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఉన్నటువంటి విద్యార్థినీలకు, బాలికల సమస్యలు, హక్కులు సమాజంలో ఎదుర్కొంటున్న దాడులపై ఆమె విద్యార్థినులకు అవగాహన కల్పించారు. బాలికల ఆరోగ్య విషయంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పాటు ఉపాధ్యాయులు కూడా చొరవ చూపించాలన్నారు. బాలికల సంరక్షణలో ముందుండి పోరాడే పోలీస్ వ్యవస్థకు, ఉపాధ్యాయులకు ధన్యవాదములు తెలియజేశారు. ఎన్ని కష్టాలు వచ్చినా విద్యను మాత్రం విడువకూడదు అని తెలియజేశారు.
ములకలపల్లి : చైల్డ్ లైన్ 1098, భద్రాద్రి కొత్తగూడెం వారి ఆధ్వర్యంలో స్థానిక సోషల్ వెల్ఫేర్ బాలికల పాఠశాల నందు అంతర్జాతీయ బాలికల దినోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చైల్డ్ లైన్ 1098 కోఆర్డినేటర్ శ్రీ రాజ్ కుమార్ బాలికకు బాలిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసి, మాట్లాడారు. చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు శ్రీ అంబేద్కర్, ఎస్ఐ సురేష్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ బేబినేని భద్రం, ఎంపీటీసీ శనగపాటి మెహరామణి, చైల్డ్ వెల్ఫేర్ కమీటీ సభ్యులు కొత్తపల్లి అంబేత్కర్, బార్ అసోషి యేషన్ కౌన్సిల్ ప్రెసిడెంట్ రాంప్రసాద్, ఎంపీడీఓ చిన్న నాగేశ్వరరావు, బాలికలు పాల్గొన్నారు.
టేకులపల్లి : అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా టేకులపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పలు చట్టాలపై బాలికలకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో ప్రాజెక్టు అధికారి ఎం.మంగ తార మంగళవారం అవగాహన కల్పించారు. బాలికలకు ఏర్పాటుచేసిన అవగాహనా సదస్సులో ఆమె మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ సూపర్వైజర్లు కె.అనురాధ, లక్ష్మి, రోజా, పాఠశాల ఉపాధ్యాయులు, ఉమ్మడి టేకులపల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని అంగన్ వాడీ టీచర్లు తదితరులు పాల్గొన్నారు.
మణుగూరు : స్త్రీ లేకపోతే జననం లేదు, గమనం లేదు, సృష్టిలో జీవమే లేదని ఆంగ్ల ఉపాధ్యాయుడు, అబ్దుల్ కలాం జాతీయ అవార్డ్ గ్రహీత, జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత షేక్ మీరా హుస్సేన్ అన్నారు. మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కో ఎడ్యుకేషన్ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. అనంతరం విద్యార్థులకు ప్రత్యేకంగా బోధిస్తున్న స్పోకెన్ ఇంగ్లీష్ తరగతిలో బాలికల విద్య ఆవశ్యకతపై ఉపన్యాస పోటీలో ఆంగ్లంలో మాట్లాడిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఉపన్యాస పోటీలో మొదటి బహుమతి నుహిత సాయి, రెండవ బహుమతి సాత్విక గెలుచుకున్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు, తదితరులు పాల్లొన్నారు.
అన్నపురెడ్డిపల్లి : ఆడపిల్ల అంటే ఓ వెలుగు లాంటిది అని సీడీపీఓ నిర్మల జ్యోతి అన్నారు. మండల కేంద్రంలో గల కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో అంతర్జాతీయ బాలికల దినోత్సవాన్ని స్పెషల్ ఆఫీసర్ కవిత ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన సీడీపీఓ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో సూపర్వైజర్ అరుణ, టీచర్స్ కరుణలత, లోకేశ్వరి, సోనిక, విజయ, అంగన్వాడీ టీచర్లు కుమారి, విజయ, లావణ్య, పార్వతి తదితరులు పాల్గొన్నారు.