Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మణుగూరు
సింగరేణి యాజమాన్యం కార్మికులపై విధించిన ప్లేడే, పీహెచ్డీలపై ఆంక్షలు ఎత్తివేయాలని సింగరేణి కాలరీస్ ఎంప్లాయిస్ యూనియన్ (సీఐటీయూ) బ్రాంచ్ కార్యదర్శి వల్లూరు వెంకటరత్నం డిమాండ్ చేశారు. సోమవారం పీవీ కాలనీ సీఐటీయూ కార్యాలయంలో టీవీ ఎం.వి ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పొదుపు పేరుతో కార్మికులను ఆర్థికంగా నష్టపరచడం మంచి పద్ధతి కాదన్నారు. కార్మికులను ఆర్థికంగా నష్టపరిచి యాజమాన్యం లాభాలు సాధించాలి అనుకోవడం పొరపాటు అన్నారు. కార్మికులను ఆర్థికంగా బలోపేతం చేసి ఉత్సాహంతో పని చేయించాలని యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. సింగరేణి వ్యాప్తంగా అనేక అక్రమాలు జరుగుతున్నాయని వాటిని నివారించాలన్నారు. వెంటనే కార్మికులను ఆర్థికంగా నష్టపరిచే చర్యలను సంహరించుకోవాలన్నారు. ఈ సమావేశంలో మాచారపు లక్ష్మణరావు, నందం ఈశ్వర్ రావు, రామ్మూర్తి ప్రభాకర్ రావు, విల్సన్ రాజు, బుచ్చిరెడ్డి, బిక్షపతి, ముజఫర్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.