Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
- నారాయణ భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించిన సీపీఐ(ఎం) జిల్లా నేతలు
నవతెలంగాణ-కొత్తగూడెం
యూటీయఫ్ మాజీ రాష్ట్ర అధ్యక్షులు నాగటి నారాయణ మృతి విద్య, వికాస ఉద్యమానికి తీరనిలోటని సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య అన్నారు. మంగళవారం ఖమ్మం జిల్లా బోనకల్ మండలం, పెద్ద బీరవల్లి గ్రామంలో ఆయన భౌతికాయాన్ని సందర్శించి, నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సంతాప సభలో భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సీపీఐ(ఎం) కార్యదర్శి అన్నవరపు కనకయ్య మాట్లాడుతూ ఉమ్మడి రాష్ట్రంలో ఉపాధ్యాయ, విద్యారంగ సమస్యలపై అనేక పోరాటాలకు నాయకత్వం వహించారన్నారు. అనేక నిర్బంధాలు ఎదుర్కొన్నాడని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత విద్య సంస్కరణ ఉద్యమానికి నాయకత్వం వహించారన్నారు. ఉపాధ్యాయ వృత్తిలో ఉంటూ సమాజ మార్పుకు కృషి చేశారని, అందుకు వామపక్ష భావజాలం సరైన సిద్ధాంతం అని నమ్మి చివరి వరకు అంకిత భావంతో పనిచేశారని కొనియాడారు. బడుగు బలహీనర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యను అందించడం కోసం భవిష్యత్ పోరాటాలకు సిద్ధం కావడమే నాగటి నారాయణకు ఇచ్చే ఘనమైన నివాళి అన్నారు. నివాళులు అర్పించిన వారిలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు లిక్కి బాలరాజు, జిల్లా కమిటీ సభ్యులు అన్నవరపు సత్యనారాయణ ఉన్నారు.