Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఐటీడీఏ పీవో
నవతెలంగాణ-భద్రాచలం
ఏరియా ఆసుపత్రి భద్రాచలం నందు ఐటీడీఏ నిధుల ద్వారా చేపడుతున్న కిచెన్ షెడ్ నిర్మాణం, బ్లడ్ బ్యాంక్ విస్తరణ త్వరిత గతిన పూర్తి చేయాలని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి గౌతం పొట్రూ సంబంధిత వైద్యాధికారులకు సూచించారు. ఇటీవల జిల్లా ఆస్పత్రులు సమన్వయ అధికారిగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ రవిబాబు పీఓని మర్యాదపూర్వకంగా కలిసి జిల్లాలోని ఆసుపత్రుల అభివృద్ధికి తీసుకోవలసిన విషయాల గురించి పీఓకి తెలిపారు. అలాగే ప్రాంతీయ ఆసుపత్రులు ఇల్లందు, అశ్వరావుపేటలోని ఆసుపత్రులను అభివృద్ధి చేయడానికి నిధులు మంజూరు చేయాలని ప్రాజెక్ట్ అధికారిని కోరగా ఆయన సానుకూలంగా స్పందించి త్వరలో విడుదల చేస్తామని, కానీ మారుమూల ప్రాంతాలలో ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు సక్రమంగా నడిచే విధంగా చూడాలని, వర్షాకాలం నడుస్తున్నందున సీజనల్ వ్యాధులు ప్రబలే అవకాశం ఉన్నందున, సిబ్బంది అందరూ వారు పనిచేసే ఆరోగ్య కేంద్రాలలో అందుబాటులో ఉండే విధంగా చూడాలని రవాణా మార్గం సరిగా లేని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు అవసరమైన మందులు అడ్వాన్సుగా అందుబాటులో ఉంచుకోవాలని, వైద్యానికి వచ్చే ప్రతి గిరిజనులకు సక్రమంగా వైద్యం చేసేలా చూడాలని, ముఖ్యంగా గర్భిణీల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో భద్రాచలం ఏరియా ఆసుపత్రి పర్యవేక్షకుడు డాక్టర్ రామకృష్ణ, ఐటడీఏ ప్రోగ్రాం మేనేజర్ బీసీ రాముడు, వైద్య విధాన పరిషత్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.