Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎస్ఈ సదాశివ కుమార్
నవతెలంగాణ-అశ్వారావుపేట
ఇంటింటికీ శుద్ధి చేసిన, సురక్షిత తాగునీటి సరఫరానే మిషన్ భగీరథ లక్ష్యం అని ఈ శాఖ ఎస్ఇ సదా శివకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో నియోజక వర్గం స్థాయిలో మండల స్థాయి అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పైపు లైన్లు లీకేజీలు సరి చేయాలని, సకాలంలో నీటి సరఫరా చేయాలని సూచించారు. ఎప్పటికపుడు మరమ్మతులు చేపట్టాలని ఆదేశించారు. కాంట్రాక్టర్లకు చెల్లించాల్సిన బకాయిల పైనా సమీక్ష జరిపారు. ఈ కార్యక్రమంలో ఈఈ తిరుమలేష్, డీఈ సయ్యద్ సలీం, అశ్వారావుపేట, దమ్మపేట, ములకలపల్లి, చండ్రుగొండ, అన్నపురెడ్డి ఏఈలు క్రిష్ణ సాగర్, వరప్రసాద్, సాయి క్రిష్ణలు పాల్గొన్నారు.