Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- పలు అభివృద్ధి కార్యక్రమాలలో ఎమ్మెల్యే వనమా
నవతెలంగాణ-కొత్తగూడెం
పల్లెలు ప్రగతి సాధించినప్పుడే దేశం అభివృద్ధి చెందుతుందని కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు అన్నారు. గురువారం లక్ష్మీదేవి పల్లి మండలంలో హమాలీ కాలనీ, చాతకొండ, సాటివారిగూడెంలలో సుమారు రూ.30 లక్షలతో సిమెంట్ రోడ్లకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. నియోజకవర్గాన్ని ఆదర్శ నియోజకవర్గంగా తీర్చి దిద్దుతున్నానని, అభివృద్ధిలో వెనకడుగు వేసేది లేదని తెలిపారు. చివరి వరకు ప్రజాసేవలోనే ఉంటానని తెలిపారు. పట్టణాలు ధీటుగా పల్లెలను అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందన్నారు. రూ.3 వేల కోట్లతో నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు జరుగుచున్నాయని తెలిపారు. కొత్తగూడెం, పాల్వంచ పట్టణాలను జంట నగరాలుగా తీర్చిదిద్దుతున్నట్లు తెలిపారు. త్వరలో రాష్ట్రముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గానికి రానున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ కంచర్ల చంద్రశేఖర్ రావు, లక్ష్మీదేవి పల్లి ఎంపీపీ భూక్యా సోన, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ భూక్య రాంబాబు, ఆత్మ కమిటీ చైర్మన్ బత్తుల వీరయ్య, ఎంపీటీసీ భద్రమ్మ, కో-ఆప్షన్ సభ్యులు జక్కుల సుందర్, సర్పంచులు భూక్య పద్మ, పూనెం సంధ్య, చింత సుజాత, బాదావత్ అనూష, ఉప సర్పంచ్ లగడపాటి రమేష్ ఎంపీడీవో రామారావు తదితరులు పాల్గొన్నారు.