Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
పోడు భూములకు పట్టాలివ్వాలని డిమాండ్ చేస్తూ 14వ తారీకు అఖిల భారత రైతు కూలీ సంఘం ఆధ్వర్యంలో గుండాలలో జరిగే బహిరంగ సభను విజయవంతం చేయాలని కోరుతూ గురువారం ఇల్లెందు మండలం పరిధిలోని కొమరారం, పోలారం, మాణిక్యారం, గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలలో అరుణోదయ కళాకారులచే కళా ప్రదర్శనలు నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ(ఎంయల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, రాష్ట్ర నాయకులు తుపాకుల నాగేశ్వరరావు, ఇల్లెందు మండల కార్యదర్శి పొడుగు నరసింహారావు మాట్లాడారు.
ఈ కార్యక్రమంలో ఐఎఫ్టియు జిల్లా ప్రధాన కార్యదర్శి కొక్కు సారంగపాణి, సర్పంచులు మోకాళ్ల కృష్ణ, బానోతు సంతు, వాంకుడోత్ శ్రీను, అరుణోదయ సాంస్కృతిక సమైక్య జిల్లా అధ్యక్ష కార్యదర్శులు కోడి శ్రీరాములు, ఎనగంటి చిరంజీవి, ఎట్టి నరసింహారావు, పీడీఎస్యూ రాష్ట్ర నాయకులు మస్తాన్, భూక్య శ్యామ్, కాంతారావు, చంటి, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.
టేకులపల్లి అడవి సంరక్షణ నియమాల సవరణలకు వ్యతిరేకంగా అఖిలభారత రైతుకూలి సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఈనెల 14న గుండాలలో జరిగే భహిరంగ సభను జయప్రదం చేయాలని కోరుతూ మండలం బోడు గ్రామంలో అరుణోదయ కళాకారులు డప్పు డాన్సులతో కళా ప్రదర్శన గురువారం నిర్వహించారు. అనంతరం న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, మండల కార్యదర్శి కల్తి వెంకటేశ్వర్లు, అఖిలభారత రైతు కూలి సంఘం జిల్లా నాయకులు ఎట్టి నర్సింహారావు, అరుణోదయ జిల్లా కార్యదర్శి చిరంజీవి, ఇఫ్టు జిల్లా ప్రధాన కార్యదర్శి సారంగపాణిలు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్యూ రాష్ట నాయకులు శ్యామ్, మస్తాన్, అరుణోదయ ఖమ్మం జిల్లా కార్యదర్శి శ్రీకాంత్ కన్నా కళాకారులు పాల్గొన్నారు.