Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ప్రభుత్వ విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
పోడు రైతులకు హక్కు పత్రాలను అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. గురువారం పగిడేరు గ్రామంలో పోడు భూముల సర్వేను పరిశీలించారు. అనంతరం ఇటీవల మరణించిన కోరం రత్తమ్మ కుటుంబాన్ని సందర్శించి కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసిఆర్ ఎన్నికల మ్యానీఫేస్టోలో ప్రకటించిన అసెంబ్లీలో తీర్మానం చేసి పోడు భూములకు హక్కు పత్రాలు అందించేందుకు సర్వే చేస్తున్నామన్నారు. తెలంగాణ భూభాగంలో 21 శాతం అడవులు ఉన్నయన్నారు. పోడు రైతులకు న్యాయం చేసేందుకు సీఎం కేసీఆర్ సర్వే చేపట్టారని తెలిపారు. అడవులపై ఆధారపడి జీవించే వారి మనుగడకు సహకరించాలన్నారు. అనంతరం మున్నూరుకాపు కల్యాణ మండపానికి రూ.50 లక్షలు కేటాయించినందుకు మున్నూరు కాపు సంఘం ఆధ్వర్యంలో రేగా కాంతారావుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం డిప్యూటీ తహాసీల్దార్ కె.రాజారావు ఎమ్మెల్యే రేగా కాంతారావుని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ కార్యక్రమాలలో ఫారెస్ట్ రేంజర్ ద్వాలియా, సెక్షన్ అధికారి సలూజ, తహసీల్దార్ నాగరాజు, ఎంపీడీఓ వీరబాబు, ఎంపీఓ పల్నాటి వెంటేశ్వర్లు, సెక్రటరి రేష్మ, ఎంపీటీసీ కుంజా కృష్ణకుమారి, సర్పంచ్ తాటి సావిత్రి, ఎస్సై పురుషోత్తం, ప్రజాప్రతినిధులు, అధిక సంఖ్యలో పోడు రైతులు, తదితరులు పాల్గొన్నారు.