Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి కనకయ్య
- పోడు భూముల సర్వేను సందర్శిస్తున్న నాయకులు
నవతెలంగాణ-కొత్తగూడెం
పోడు సాగు చేస్తు భూమి మీద ఉన్న రైతులకు సర్వే చేసి అందరికీ హక్కు పత్రాలు ఇవ్వాలి సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి అన్నవరపు కనకయ్య ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం లక్ష్మీదేవిపల్లి మండలం పెద్దతండ పంచాయతీలో పోడు భూముల సర్వేను కనకయ్య సందర్శించి పరిశీలించారు. అనంతరం కనకయ్య మాట్లాడారు. సర్వేలో రైతులకు ఎలాంటి లోటుపాట్లు జరగకుండా చూడాలన్నారు. ఎఫ్ఆర్సీ కమిటీ ఆధ్వర్యంలో సంపూర్ణంగా సర్వే చేసి గ్రామంలో దరఖాస్తు చేయని వారు ఎవరైనా ఉంటే వారికి కూడా అవకాశం కల్పించి సర్వే చేసి వారికి కూడా హక్కు పత్రాలు ఇవ్వాలని కనకయ్య డిమాండ్ చేశారు. భూముల మీద ఆదివాసీలు మైదాన ప్రాంత గిరిజనులు, బీసీలు కొన్ని సంవత్సరాల నుండి భూమి మీద వ్యవసాయం చేస్తూ జీవనం కొనసాగిస్తున్నారని తెలిపారు. వారికి హక్కు పత్రాలు ఇవ్వాలని అన్నారు. ఇప్పటికే ఫారెస్ట్ అధికారులు పేద ప్రజల దగ్గర నుండి ఫారెస్ట్ భూమిని ట్రెంంచులు చేసి తీసుకున్నటువంటి భూమిని కూడా పూర్తిగా భూమి లేని నిరుపేదలైన ఆదివాసి గిరిజనులకు, పేద రైతులకు భూమి ఇవ్వాలన్నారు. మూడు తరాలుగా భూమి మీద ఉండి సేద్యం చేసుకుంటూ జీవనం కొనసాగిస్తున్న రైతులకు సర్వే ప్రకారం పట్టాలు ఇవ్వాలని అన్నారు. మూడు తరాలుగా భూమి మీద ఉండి సాగు చేస్తూ వారి జీవనం గడుపుతున్న పేద మధ్య తరగతి సన్నకారు రైతులకు పట్టాలు, ఎలాంటి షరతులు లేకుండా భూమి మీద ఉన్న ప్రతి ఒక్క రైతుకు హక్కు పత్రాలు ఇవ్వాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో లక్ష్మీదేవి పార్టీ మండల కార్యదర్శి యు.నాగేశ్వరావు, ఎఫ్ఆర్సి గ్రామ కమిటీ చైర్మన్ ధరావత్ వెంకన్న, ఎన్. సూర్య, ఎల్.కుమార్, హుస్సేన్, రమేష్, రైతులు పాల్గొన్నారు.