Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఇల్లందు
కార్మికులకు, ఉద్యోగులకు క్యాంటీన్ సౌకర్యం పునరు ద్ధరించాలని టిబిజికెఎస్ వైస్ ప్రెసిడెంట్ రంగనాథ్ కోరారు. స్థానిక కార్యాలయంలో గురువారం వినతిపత్రం సమర్పించారు. అనంతరం మాట్లాడారు. గతంలో ఈ సౌకర్యం ఉండేదని కానీ ఇటీవల ఇది ఆగిపోయిందని అన్నారు. జీఎం సహృదయంతో స్పందించి తప్పకుండా ఏర్పాటు చేపిస్తానని తెలిపారని పేర్కొన్నారు. వెంటనే అధికారులను కూడా ఆదేశించి త్వరగా క్యాంటీన్ ఏర్పాటుకు అవసరమైన ఏర్పాట్లు చూడాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో యాదగిరి, కోదండరామయ్య, అనిల్, దరియసింగ్, సారంగపాణి, మోయిన్ భాష, శ్రీనివాసరెడ్డి, వీరన్న విజరు, రవి, సాంబయ్య, కిషోర్, సరోజ, కన్యాకుమారి, దుర్గ, అనూష, శారద, మంగ పాల్గొన్నారు.