Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-పినపాక
పోడుభూములు సాగు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికీ పోడు పట్టాలు అందుతాయని టీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు పగడాల సతీష్ రెడ్డి తెలిపారు. గురువారం మండల పరిధిలోని మల్లారం గ్రామంలో గల పోడు సర్వే జరుగుతున్న పొలాల్లో ఆత్మ కమిటీ చైర్మన్ పొనుగోటి భద్రయ్య, సొసైటీ చైర్మన్ రవివర్మతో కలిసి పర్యటించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోడుసాగుదారులకు హక్కు కలుగుతుందన్నారు. అర్హులైన పోడుసాగుదారులకు పట్టాలు మంజూరు చేస్తారని, పట్టాలు వచ్చిన రైతులకు రైతుబంధు పధకం అమలు చేయడం జరుగుతుందన్నారు. పోడు భూముల సమస్య పరిష్కారానికి తెలంగాణా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకవెళ్లారని, పోడు సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని అనేక సార్లు సమస్యను సీఎంకు వివరించడం జరిగిందన్నారు. దీంతో సీఎం కేసీఆర్ నిర్ణయం ప్రకారం పోడు సర్వే జరుగుతుందన్నారు. త్వరలోనే సర్వే పూర్తి అవుతుందని పోడుసాగుదారులు అధైర్యపడవద్దని తెలిపారు. ఈ కార్యక్రమంలో మల్లారం టీఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షుడు ఇర్పా సాంబశివరావు, గ్రామ పెద్దలు గొంది నర్సింహారావు, కొమరం నారాయణ పాల్గొన్నారు.