Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-ఆళ్ళపల్లి (గుండాల)
కలెక్టర్, వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఆదేశాల మేరకు గుండాల మండల పరిధిలోని దామరతోగు గ్రామంలో గురువారం ఉచిత ఆరోగ్య శిబిరం స్థానిక వైద్యాధికారి రవిచంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామ పం చాయతీ కార్యాలయంలో వైద్య శిబిరం నిర్వహించి జ్వర పీడితులకు రక్తపూతలు రాపిడ్ ఫీవర్ టెస్ట్లు నిర్వహించి, ఉచితంగా మందులు పంపిణీ చేయడం జరిగిందన్నారు. అనంతరం టీ హబ్ ద్వారా ఇతర సమస్యలకు రోగాలకు రక్త పరీక్షలు నిర్వహించి గ్రామస్తులకు సీజనల్ వ్యాధులు, జ్వరాలపై అవగాహన కల్పించటం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరూ తమ పరిసరాలు చుట్టుపక్కల నిలువ నీరు లేకుండా చూసుకోవాలని, పాత టైర్లు, కొబ్బరి బోండాలలో నీళ్లు నిలువ లేకుండా చూసుకోవాలని సూచించామన్నారు. ఎవరికైనా జ్వరం జలుబు ఉన్నట్లయితే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సందర్శించి మందులు తీసుకోవాల్సిందిగా చెప్పారు. ఈ కార్యక్రమంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కమల, అరుణకుమారి, అనసూయ, ఎల్.టీ రమేష్, హెల్త్ అసిస్టెంట్ రమేష్, ఆశ వర్కర్లు రాంబాయి, సుమలత పాల్గొన్నారు.