Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఎంబీ నర్సారెడ్డి
నవతెలంగాణ-భద్రాచలం
సీఐటీయూ జిల్లా మూడవ మహాసభల నేపథ్యంలో ప్రచారంలో భాగంగా గుడి కరకట్ట కింద గోదావరి ఒడ్డున ఉన్న పుట్ ఫాత్ వ్యాపారుల జనరల్ బాడీ సమావేశం గురువారం జరిగింది. ఈ సమావేశంలో సీఐటీయూ జిల్లా నాయకులు నర్సారెడ్డి మాట్లాడుతూ...ఈ చిరు వ్యాపారులు వరుసగా నాలుగు సార్లు వచ్చిన గోదావరి వరదలు వలన షాపులు పూర్తిగా మునిగిపోయి సరుకు మొత్తం తడిచిపోవటం జరిగిందని వీరికి ప్రభుత్వము కనీస ఆర్థిక సహకారం కూడా ఇవ్వకపోవడం చాలా దుర్మార్గమని అన్నారు. రోజు డైలీ ఫైనాన్స్‌ల వలన షాపులు నడవక అప్పులు కట్టలేక ఆర్థిక సమస్యలతో సతమతమవుతున్న ఈ చిరు వ్యాపారులను ప్రభుత్వం ఆదుకోవాలని, ఆర్థిక సహకారం అందించాలని, ఉచిత ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్మికులకు సీఐటీయూ ఎప్పుడు అండగా ఉంటుందని ఆయన అన్నారు. అనేక రంగాల కార్మికుల సమస్యలపై పనిచేసే సీఐటీయూ జిల్లా మహాసభలు 25 సంవత్సరాల తర్వాత భద్రాచల పట్టణంలో జరుగుతున్నాయని వీటి జయప్రదం కోసం కార్మికులందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ సందర్భంగా నూతన కమిటీని 11 మందితో ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అధ్యక్ష కార్యదర్శులుగా కోలా గంగ, మైల సుధా, కోశాధికారిగా లంకె ఆదిని ఎన్నుకోవడం జరిగింది. ఈ సమావేశంలో శ్రామిక మహిళ పట్టణ కన్వీనర్ మర్లపాటి రేణుక, సీఐటీయూ టౌన్ నాయకులు లక్ష్మీకాంత్, సింగిడాల రామకృష్ణ, శ్రీనివాస్, నాగరాజు, రామకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.