Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-అన్నపురెడ్డిపల్లి
రైతు ఆరుగాలం కష్టపడి పండించిన పంట చేతికి వచ్చే సమయంలో కూడా కష్టపడాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల పరిధిలోని రాజపురం గ్రామంలో ముందుగా వరి సాగు చేయడంతో వరి కోతకు రావడంతో ఉప్పరి అశోక్ అనే రైతు నాలుగు ఎకరాలు వరి పొలం కోయడానికి చైన్ మిషన్తో వరి హార్వెస్టింగ్ చేయడంతో ఎకరానికి రూ.3000 ఖర్చు అవుతుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ముందుగా వరి సాగు చేసిన చేతికి వచ్చే సమయంలో ఎంతో ఆనందంగా ఉండే రైతు ఈ సంవత్సరం గత రెండు నెలలు క్రితం వరి పొట్ట దశలో వర్షాలు లేకపోవడంతో కొన్ని చోట్ల వరి ఎండిపోయి మరి కొన్ని చోట్ల వరి పొలాలకు ఇంజిన్లు పెట్టీ వేల రూపాయలు పెట్టుబడి పెట్టి నీళ్ళు పెట్టాము అని, ఇప్పుడు వరి కోతకు వచ్చి పంట ఇంటికి వచ్చే సమయంలో వర్షాలు కురుస్తుండటంతో మళ్ళీ వేల రూపాయలు వెచ్చించి వరి కోతలు కోయించలసి వస్తుంది అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎది ఏమి అయిన రైతులుకు వరి పంటకు కురువ వలసిన సమయంలో వర్షం కురవకుండ అవసరం లేని సమయంలో వర్షం కురువడం వలన ఆర్థికంగా ఎంతో నష్టపోతున్నాము అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.