Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- వంద పడకల ప్రభుత్వాసుపత్రిని సందర్శించిన విప్ రేగా
నవతెలంగాణ-మణుగూరు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో అన్ని ప్రభుత్వ ఆసుసత్రులలో ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్, పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు అన్నారు. గురువారం పినపాక నియోజకవర్గ కేంద్రం మణుగూరు వంద పడకల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిని సందర్శించి వైద్య సేవలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిలో పలు రకాల సమస్యలతో చికిత్స పొందుతున్న రోగులకు అందిస్తున్న వైద్య సేవలు గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఆయా గ్రామాల నుంచి వచ్చి చికిత్స పొందుతున్న వారిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ హయంలో ప్రభుత్వ ఆసుపత్రిలు అనేక రకాలుగా మెరుగుపడుతున్నాయన్నారు. ప్రజలకు ప్రభుత్వం వైద్యంపై భరోసా కల్పించడంతో బాధితులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి అని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో ఆరోగ్య సమాజాన్ని తీర్చిదిద్దేదెందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదన్నారు. ప్రజలు ప్రయివేట్ ఆసుపత్రులను ఆశ్రయించకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో వైద్యం చేయించుకో వాలన్నారు. వంద పడకల ఆసుపత్రిలో 24 గంట వైద్య సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఆసుపత్రిలో ఉండే రోగులకు భోజనం, అన్ని రకాల సదుపాయాలు ప్రభుత్వం ఏర్పాటు చేసిందన్నారు. జిల్లాలోనే కొత్తగూడెం, భద్రాచలం, ఇల్లందు, మణుగూరు ప్రభుత్వ ఆసుపత్రులలో అత్యవసర వైద్య సేవలు అందుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, తదితరులు పాల్గొన్నారు.