Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు
నవతెలంగాణ-బోనకల్
సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ ఖమ్మం జిల్లాలో కేంద్రీకరించిన నియోజకవర్గాలపై క్షేత్రస్థాయిలో ప్రజా సమస్యలపై పోరాటాలు నిర్వహించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు పొన్నం వెంకటేశ్వరరావు కోరారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో మధిర నియోజకవర్గస్థాయి సమావేశాన్ని శీలం నరసింహారావు అధ్యక్షతన గురువారం నిర్వహించారు. ఈ సమావేశంలో పొన్నం వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా సిపిఎం ప్రజా సమస్యలపై క్షేత్రస్థాయిలో ప్రజా పోరాటాల ద్వారానే పార్టీ అభివృద్ధి చెందుతుందని అందుకు అవసరమైన ప్రణాళికను రూపొందించి పోరాటాలు నిర్వహించాలన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సమస్యలను గాలికి వదిలేసి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోవటమే సరిపోతుందని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నిక కాంగ్రెస్, టిఆర్ఎస్, బిజెపి పార్టీలకు సవాలుగా మారాయని ఎద్దేవా చేశారు. మునుగోడు ఉప ఎన్నికలలో కోట్లాది రూపాయల గుమ్మరించేందుకు అన్ని పార్టీలు సిద్ధమయ్యాయన్నారు. కేంద్రంలో బిజెపి ప్రభుత్వం మతతత్వాన్ని రెచ్చగొడుతూ అధికారంలోకి రావాలని ప్రయత్నాలు చేస్తుందని విమర్శించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతుందని విమర్శించారు. ఈ సమావేశంలో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు చింతలచెరువు కోటేశ్వరరావు, మధిర నియోజకవర్గ స్థాయి నాయకులు వత్సవాయి జానకి రాములు, మద్దాల ప్రభాకర్, మండవ ఫణీంద్ర కుమారి, రాధాకష్ణమూర్తి, పడకంటి మురళి, మందడపు శ్రీనివాసరావు, బంధం శ్రీనివాసరావు, దివ్వెల వీరయ్య, టీఎస్ కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు.