Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీసీ రోడ్లకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే
నవతెలంగాణ-వైరా
మండలంలోని తాటిపూడి, అష్ట గుర్తి, గన్నవరం, గరికపాడు నార్పనేనిపల్లి గ్రామంలో ఎసిడిపి, ఎస్నిడిఎఫ్ నిధులతో మంజూరు కాబడిన సిసి రోడ్లకు ఎమ్మెల్యే లావూడ్య రాములు నాయక్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నాయకత్వంలో మన రాష్ట్రం అనేక విధాలుగా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అన్నారు. రాబోయే రోజులలో ఇంకా అనేక నిధుల నుంచి మన వైరా నియోజక వర్గంలోని ప్రతి గ్రామాన్ని, ప్రతి పట్టణాన్ని, అభివృద్ధి చేయటంలో నేను ముందుంటానని, ఇంకా అనేక నిధులు తీసుకొచ్చి మీ గ్రామాలకి సిసి రోడ్లు ఇంకా ఏమైనా అవసరాలు ఉంటే పూర్తి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మార్కుపైడ్ వైస్ చైర్మన్ బొర్రా రాజశేఖర్, ఎంపీపీ వేల్పులు పావని, వైరా మార్కెట్ చైర్మన్ బీడీకే రత్నం, వైరా నియోజకవర్గ ఆత్మ కమిటీ చైర్మన్ కోసూరి శ్రీనివాసరావు, జడ్పిటిసి నంబూరి కనకదుర్గ, జడ్పీ కోఆప్షన్ సభ్యులు షేక్ లాల్ మహమ్మద్, మండల అధ్యక్షులు బాణాల వెంకటేశ్వరరావు, రైతు సమన్వయ సమితి మండల కన్వీనర్ మిట్టపల్లి నాగేశ్వరరావు, జిల్లా నాయకులు మచ్చ బుజ్జి, మాజీ మార్కెట్ చైర్మన్ మరియు జిల్లా నాయకులు గుమ్మా రోశయ్య, వైరా మండలం యువజన విభాగ అధ్యక్షులు జివ్వాజీ నాగరాజు, తాటిపూడి సర్పంచి భద్రయ్య, ఎంపీటీసీ కాటమరాజు, ఉపసర్పంచి సత్యానంద్, తాత రంగారావు, అష్ణగుర్తి సర్పంచ్ ఇటుకల మురళి, గన్నవరం సర్పంచి విజయలక్ష్మి, ఎంపీటీసీ సౌజన్య, గోవిందాపురం సర్పంచి బుద్దా సురేష్, గరికపాడు సర్పంచి కోట ఏలేష, నారపనేనిపల్లి సర్పంచ్ శీలం సుజాత, ఎంపీటీసీ వెంకటరామిరెడ్డి, వెమిరెడ్డి వెంకట కోటా రెడ్డి, వైరా పట్టణ నాయకులు మోటపోతుల సురేష్, ఆయా గ్రామాల ప్రజా ప్రతినిధులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు.
వైరాలో చేప పిల్లలను విడుదల చేసిన ఎమ్మెల్యే
వైరా రిజర్వాయర్ నందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సబ్సిడీ ద్వారా ఇస్తున్నటువంటి ఉచిత చేప పిల్లలను గురువారం వైరా ఎమ్మెల్యే లావుడియా రాములు నాయక్ విడుదల చేశారు. చేపల సొసైటీ వారి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజా ప్రతినిధులతో కలిసి రిజర్వాయర్ నందు చేప పిల్లలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు నేతృత్వంలో దినదినాభివృద్ధి సాగుతుందని, రాబోయే రోజులలో అన్ని కులవృత్తులు గాని, చేతివృత్తులు గాని, అందరికీ కూడా అన్ని ఫలాలు అందుతాయని ఈ సందర్భంగా తెలియజేశారు.
ఐఐటీ విద్యార్థినిని సన్మాంచిన ఎమ్మెల్యే రాములు నాయక్
నిరుపేద కుటుంబంలో జన్మించి ప్రభుత్వ పాఠశాలలలో చదివి ఐఐటీ గౌహతిలో సీట్ సాధించిన పెద్దపోలు గాయత్రీని గురువారం వైరా శాసనసభ్యులు లావూడ్య రాములు నాయక్ ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ నందు సన్మానించారు. వైరా మండలం ఖానాపురం గ్రామానికి చెందిన పెద్దపోలు రమేష్, మహేశ్వరీల కుమార్తె గాయత్రి, ప్రభుత్వ నవోదయ పాలేరులో చదివి ఐఐటీలో సీట్ సాధించినది. పెద్దపోలు గాయత్రిని ఎమ్మెల్యే లావూడ్య రాములునాయక్ శాలువాతో సన్మానించి స్వీట్ తినిపిం చారు. రాబోయే రోజులలో ఇంకా మంచి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆ చిన్నారిని అభినందించారు. అందుకు సహకరించిన వారి తల్లిదండ్రులను గురువులకు కూడా అభినందనలు తెలిపారు.