Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ - బోనకల్
మండల పరిధిలోని రావినూతల గ్రామానికి చెందిన సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు యనమదల విక్రమ్ తండ్రి యనమదుల జోషి దశదిన కార్యక్రమాన్ని గురువారం గ్రామంలో నిర్వహించారు. ఈ సందర్భంగా జోషి చిత్రపటానికి సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు పోతినేని సుదర్శన్ రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్ర శ్రీకాంత్, పొన్నం వెంకటేశ్వరరావు, సిపిఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, పార్టీ సీనియర్ నాయకులు మన్నేపల్లి సుబ్బారావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు బండి రమేష్, మాచర్ల భారతి, బుగ్గవేటి సరళ, కళ్యాణపు వెంకటేశ్వర రావు, బొంతు రాంబాబు, చింతల చెరువు కోటేశ్వరరావు, సీపీఐ(ఎం) ఖమ్మం వన్ టౌన్, టూ టౌన్, 3 టౌన్ కార్యదర్శులు ఎంఏ జబ్బర్, బోడ పట్ల సుదర్శన్, ఎర్ర శ్రీనివాసరావు జోషి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సీపీఐ(ఎం) జిల్లా సీనియర్ నాయకులు రాయల వెంకటేశ్వరరావు, బత్తినేని వెంకటేశ్వరరావు, సిద్ధినేని కోటయ్య, తాతా భాస్కరరావు, జిల్లా కేంద్ర సహకార బ్యాంకు మాజీ ఉపాధ్యక్షుడు ఉమ్మనేని కోటయ్య, సీపీఐ(ఎం) బోనకల్ మండల సీనియర్ నాయకులు మాదినేని నారాయణ, ఎంపీపీ కంకణాల సౌభాగ్యం మాజీ ఎంపీపీలు తుళ్లూరు రమేష్, చిట్టుమోదు నాగేశ్వరరావు జోషి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రముఖ విద్యావేత్తలు రవి మారుతి, మువ్వా శ్రీనివాసరావు ప్రముఖ లాయర్లు కొల్లి సత్యనారాయణ, ఏడు నూతల శ్రీనివాసరావు, తన్నీరు పాపయ్య డాక్టర్లు డాక్టర్ సుమంత్ డాక్టర్ ఆదిశంకరరావు, ఖమ్మం నగర కార్పొరేటర్లు షేక్ ముస్తఫా, దొడ్డ నగేష్ రియల్ ఎస్టేట్ వ్యాపారి కిలారు బాబ్జి, బీవీ రాఘవులు జోషి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. బోనకల్, చింతకాని, ఎర్రుపాలెం, ముదిగొండ, వైరా రూరల్ పార్టీ మండలాల కార్యదర్శులు దొండపాటి నాగేశ్వరరావు, మడిపల్లి గోపాలరావు, దివ్వెల వీరయ్య, బంటు పురుషోత్తం, తోట నాగేశ్వరరావు, సిపిఎం మధిర పట్టణ కార్యదర్శి మండవ ఫణీంద్ర కుమారి జోషి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. సిపిఎం ఖమ్మం జిల్లా కమిటీ సభ్యులు, ఖమ్మం జిల్లాకు చెందిన వివిధ రంగాల ప్రముఖులు, బోనకల్ మండలంలోని మండల కమిటీ సభ్యులు, శాఖ కార్యదర్శులు, ప్రజా ప్రతినిధులు, ప్రజాసంఘాల బాధ్యులు, కాంగ్రెస్, టిఆర్ఎస్, సిపిఐలకు చెందిన పలువురు నివాళులర్పించారు.
జోషికి మాజీ మంత్రి తుమ్మల, జెడ్పీ చైర్మెన్ కమల్ రాజు నివాళి
రావినూతల గ్రామంలో యనమదల జోషి చిత్రపటానికి మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు, జిల్లా పరిషత్ చైర్మన్ లింగాల కమల్ రాజు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. వారి కుటుంబ సభ్యులైన వేణు, విక్రమ్ లను పరామర్శించి, సంతాప సానుభూతి తెలిపారు. జోషి మృతికి గల కారణాలను విక్రమ్ ను అడిగి తెలుసుకున్నారు. జోషికి నివాళులర్పించిన వారిలో టిఆర్ఎస్ మండల అధ్యక్షుడు చేబ్రోలు మల్లికార్జునరావు, రైతుబంధు మండల కన్వీనర్ వేమూరి ప్రసాద్ రావు, మాజీ మండల అధ్యక్షుడు బంధం శ్రీనివాసరావు, రావినూతల సర్పంచ్ కొమ్మినేని ఉపేందర్ ఉన్నారు.