Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15వేల పైగా జనం, 3వేల మోటారుసైకిళ్లతో పట్టణంలో భారీ ప్రదర్శన నిర్వహించాలి
- ఈనెల 17న జరిగే ఎంపీలు బండి, వద్దిరాజుల సన్మానసభ విజయవంతంపై పార్టీ శ్రేణులతో ఎమ్మెల్యే సండ్ర
నవతెలంగాణ- సత్తుపల్లి
ఈనెల 17న సత్తుపల్లిలో జరిగే రాజ్యసభ సభ్యులు బండి పార్థసారధిరెడ్డి, వద్దిరాజు రవిచంద్రలను ఘనంగా సన్మానించుకుందామని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య టీఆర్ఎస్ శ్రేణులను కోరారు. బండి, వద్దిరాజు సన్మానసభ విజయవంతంపై ఎమ్మెల్యే సండ్ర గురువారం స్థానిక లక్ష్మీప్రసన్న ఫంక్షన్‌హాలులో పార్టీ శ్రేణులతో సన్నాహక సమావేశం జరిపారు. సన్మానసభ స్థానిక జేవీఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా మైదానంలో సాయంత్రం 5 గంటలకు సభ ప్రారంభమవుతుందన్నారు. 4:30 గంటల కల్లా జనమంతా సభాస్థలికి చేరుకొనేలా పార్టీ శ్రేణులు చూసుకోవాలన్నారు. అంతకు ముందు పట్టణంలో 15వేల మంది పైగా జనసమీకరణతో పాటు 3వేలకు తగ్గకుండా మోటారుసైకిళ్లతో భారీ ప్రదర్శన తీయాలన్నారు. పట్టణానికి దగ్గరగా ఉన్న గ్రామాల నుంచి ఎక్కువ మంది జనం పాల్గొనేలా పార్టీ శ్రేణులు కృషి చేయాలన్నారు. సత్తుపల్లి మున్సిపాలిటీ పరిధిలోని అన్ని వార్డుల నుంచి భారీగా ప్రజలు పాల్గొనేలా చూసుకోవాలని, ఇందుకు ఆయా వార్డుల కౌన్సిలర్లు పూర్తి బాధ్యత తీసుకోవాలన్నారు. సభ విజయవంతంలో రూరల్, పట్టణ కమిటీలకే ఎక్కువ బాధ్యత ఉందన్నారు. టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు యాగంటి శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో జిల్లా గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ కొత్తూరు ఉమామహేశ్వరరావు, మున్సిపల్ ఛైర్మెన్ కూసంపూడి మహేశ్, ఆత్మ కమిటీ ఛైర్మెన్ శీలపురెడ్డి హరికృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్ ఛైర్మెన్ తోట సుజలారాణి, కౌన్సిలర్లు కంటె నాగలక్ష్మీ, మట్టా ప్రసాద్, చాంద్‌పాషా, నాగుల్‌మీరా, అద్దంకి అనిల్‌కుమార్, రఘు, నాయకులు వల్లభనేని పవన్, నడ్డి ఆనందరావు, రవీంద్రరెడ్డి, గఫార్, అన్ని గ్రామశాఖల బాధ్యులు, ఎంపీటీసీ సభ్యులు, సొసైటీ అధ్యక్షులు పాల్గొన్నారు.