Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్
నవతెలంగాణ- బోనకల్
భారత ప్రజాతంత్ర యువజన సమైక్య (డీవైఎఫ్ఐ) ఆల్ ఇండియా కమిటీ పిలుపులో భాగంగా నవంబర్ 3 న జరిగే చలో ఢిల్లీ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఆ సంఘం ఖమ్మం జిల్లా కార్యదర్శి షేక్ బషీరుద్దీన్ కార్యకర్తలను కోరారు. మండల కేంద్రంలోని వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట అమరవీరుల భవనంలో చలో ఢిల్లీ పోస్టర్స్ ను గురువారం డివైఎఫ్ఐ మండల కమిటీ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. దేశంలో రోజురోజుకీ నిరుద్యోగ సైన్యం పెరిగిపోతుందని, ఉన్నత చదువులు చదివి మానసికంగా దృఢంగా ఉన్న యువత ఉద్యోగాలు, ఉపాధి లేక ఇబ్బంది పడుతున్నారన్నారు. నిరుద్యోగులందరికీ ఉద్యోగాలు వెంటనే కల్పించాలని లేదా ఉపాధి చూపించాలని ఆయన డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వ పరిధిలో దాదాపు పది లక్షల పైన ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని, నింపేందుకు కేంద్ర ప్రభుత్వం ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వడం లేదని ఆయన అన్నారు. ఈ 10 లక్షల పోస్టులను భర్తీ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. బీజేపీ అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరం రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని యువతకు హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి 9 సంవత్సరాలు పూర్తవుతున్న ఒక్క నోటిఫికేషన్ కూడా ఇవ్వలేదని విమర్శించారు. కొత్త ఉద్యోగాలు ఇవ్వకపోగా పాత ఉద్యోగాలు కూడా పీకేస్తున్నారని ప్రభుత్వ రంగ సంస్థలను అత్యంత తక్కువ ధరలకు కార్పొరేట్ శక్తులకు అమ్మేసి ఉన్న ఉద్యోగాలను కూడా పీకేస్తున్నారని ఆయన విమర్శించారు. ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద జరిగే ధర్నా, ర్యాలీలో కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు సత్తెనపల్లి నరేష్, డివైఎఫ్ఐ జిల్లా నాయకులు రావులపాటి నాగరాజు, డివైఎఫ్ఐ బోనకల్ మండల అధ్యక్ష కార్యదర్శులు బానోత్ గోపి, బంక శ్రీను, నాయకులు బాబురావు, సన్నీ, ఇరుగు బాబు, నరేష్ తదితరులు పాల్గొన్నారు.